• Telugu News
  • /Hyderabad

Hyderabad Traffic Diversions : రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

శ్రీరామనవమి శోభాయాత్ర కారణంగా హైదరాబాద్‌లో రేపు ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలి.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Mar 26, 2026, 6:14 pm IST
Read Time: 2 mins
Hyderabad Traffic Diversions : రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

విధాత, హైదరాబాద్ : జంటనగరాల ప్రజలకు నగర పోలీస్ శాఖ కీలక ట్రాఫిక్ సూచనలు చేసింది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉండనున్నట్లుగా వెల్లడించింది. ట్రాఫిక్ సూచనల మేరకు వాహనదారులు అప్రమత్తం కావాలని సూచించింది.

కోఠి సీతారాంబాగ్ దేవాలయం నుంచి సుల్తాన్‌ బజార్ వరకు శ్రీరామ నవమి శోభయాత్ర జరగనున్నందునా… ఈ మార్గంలో వాహనాలకు అనుమతి ఉండదని పేర్కొంది. శోభాయాత్ర సమయంలో ట్రాఫిక్ ను ఇతర మార్గాల్లోకి మళ్లించనున్నారు. సీతారాంబాగ్, భోయిగూడ కమాన్ నుంచి మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వైపు ట్రాఫిక్ మళ్లించునున్నారు. మంగళ్‌హాట్, గాంధీ విగ్రహం, పురానాపూల్, జుమేరాత్ బజార్ నుంచి వచ్చే వాహనాలను టక్కర్‌వాడీ జంక్షన్ వైపు డైవర్ట్‌ చేయనున్నట్లుగా పోలీస్ శాఖ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి :

ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణికుల సంఖ్యను పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి
RRB Railway Jobs | 10th, ఐటీఐతో ఇండియన్ రైల్వేలో జాబ్స్.. 11,127 పోస్టులతో భారీ నోటిఫికేషన్.. ఎలా అప్లై చేసుకోవాలంటే..!