బస్ భవన్ ఎదుట..ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన

హైదరాబాద్ బస్ భవన్ ఎదుట ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. పెండింగ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈఎస్ఐ సౌకర్యాలు, వితంతు ఉద్యోగుల పెన్షన్ కేసుల పరిష్కారాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లోని బస్ భవన్ వద్ద ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు భారీగా ధర్నాకు దిగారు. భారీ సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు బస్ భవన్‌కు చేరుకోగా, అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మెడికల్ బెనిఫిట్స్ కూడా పూర్తిగా అందడం లేదని రిటైర్డు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించడంతో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలంటూ ధర్నా నిర్వహించారు. అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పెండింగ్ బకాయిలు చెల్లించడంతో పాటు ESI ఆస్పత్రిలో 2 నెలలకు సరిపడా మందులు అందించాలని, మరణించిన ఉద్యోగి భార్య/భర్తలకు సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని, వితంతు ఉద్యోగులకు PF, Gratuity, పెన్షన్ కేసుల్ని త్వరగా పరిష్కరించాలని కోరారు.

Latest News