వారంలో విదేశాల నుంచి 4,020 ఆక్సిజన్ సిలిండర్లు
విధాత(భువనేశ్వరం): ఒడిశా రాజధాని భువనేశ్వర్ విమానాశ్రయానికి ఈ వారంలో విదేశాల నుంచి 4,020 ఆక్సిజన్ సిలిండర్లు రానున్నాయి. ఈ విమానాశ్రయం గత నెల 23 నుంచి ఈ నెల 11 మధ్య 156 ఆక్సిజన్ ట్యాంకర్లు, 536 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 140 ఆక్సిజన్ సిలిండర్లను రవాణా చేసినట్టు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తెలిపింది. 10 లీటర్ల సీమ్‌లెస్ సిలిండర్లు 3,500, 46.7 లీటర్ల సీమ్‌లెస్ సిలిండర్లు 1,520 రవాణాలో ఉన్నాయని, ఇవి మరో […]
విధాత(భువనేశ్వరం): ఒడిశా రాజధాని భువనేశ్వర్ విమానాశ్రయానికి ఈ వారంలో విదేశాల నుంచి 4,020 ఆక్సిజన్ సిలిండర్లు రానున్నాయి. ఈ విమానాశ్రయం గత నెల 23 నుంచి ఈ నెల 11 మధ్య 156 ఆక్సిజన్ ట్యాంకర్లు, 536 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 140 ఆక్సిజన్ సిలిండర్లను రవాణా చేసినట్టు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తెలిపింది.
10 లీటర్ల సీమ్‌లెస్ సిలిండర్లు 3,500, 46.7 లీటర్ల సీమ్‌లెస్ సిలిండర్లు 1,520 రవాణాలో ఉన్నాయని, ఇవి మరో వారం రోజుల్లో విదేశాల నుంచి భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకుంటాయని ఏఏఐ పేర్కొంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram