Haryana | బావ వస్తున్నాడు.. దండలు సిద్ధం చేయండి! అగ్ని ఆజ్యంలా.. ఓ వర్గాన్నిరెచ్చగొట్టే వ్యాఖ్యలు
Haryana | మత ఘర్షణలను ప్రేరేపిస్తున్నసోషల్ వీడియోలు హర్యానాలో హింస త్వరగా వ్యాప్తికి అవే కారణాలు పలు కేసుల్లో నిందితులు.. వివాదాస్పద వ్యాఖ్యలు ఇండియా టుడే ఇంటెలిజెన్స్ పరిశోధనలో వెలుగులోకి విధాత: తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచె.. అన్నట్టు కొందరు ఆకతాయిలు చేసిన వ్యాఖ్యలు హర్యానాలో మత ఘర్షణలను ప్రేరేపించాయి. ఓ వర్గాన్నిరెచ్చగొట్టే వ్యాఖ్యలున్న వీడియోలు వైరల్ కావడంతో అగ్నికి ఆజ్యంలా.. గొడవలు ఇతర ప్రాంతాలకు గంటల్లోనే వ్యాపించాయి. పలు కేసుల్లో నిందితులు, భజరంగ్‌దళ్ నేతలు, […]

Haryana |
- మత ఘర్షణలను ప్రేరేపిస్తున్నసోషల్ వీడియోలు
- హర్యానాలో హింస త్వరగా వ్యాప్తికి అవే కారణాలు
- పలు కేసుల్లో నిందితులు.. వివాదాస్పద వ్యాఖ్యలు
- ఇండియా టుడే ఇంటెలిజెన్స్ పరిశోధనలో వెలుగులోకి
విధాత: తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచె.. అన్నట్టు కొందరు ఆకతాయిలు చేసిన వ్యాఖ్యలు హర్యానాలో మత ఘర్షణలను ప్రేరేపించాయి. ఓ వర్గాన్నిరెచ్చగొట్టే వ్యాఖ్యలున్న వీడియోలు వైరల్ కావడంతో అగ్నికి ఆజ్యంలా.. గొడవలు ఇతర ప్రాంతాలకు గంటల్లోనే వ్యాపించాయి. పలు కేసుల్లో నిందితులు, భజరంగ్‌దళ్ నేతలు, పలు నేరారోపణలు ఎదుర్కొంటూ తప్పించుకొనే తిరిగే ఇద్దరు, ముగ్గురు షోషల్ మీడియాలో రాజేసిన మంట హర్యానా రాష్ట్రమంతా వ్యాపించింది. ఆరుగురిని పొట్టనబెట్టుకున్నది. వేల కోట్ల ఆస్తులను బుగ్గిపాలు చేసింది.
హర్యానాలో మత ఘర్షణలు ఇంతలా వ్యాపించడానికి కారణాలు ఏమిటని ఇండియా టుడే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ జరిపిన పరిశోధనలో అసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. హింసకు దారితీసే బెదిరింపులు, ప్రేరేపణల వీడియోలు సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ కావడం వల్లే హర్యానాలోని నుహ్‌లో హింస చెలరేగి దవానలంలా వేగంగా వ్యాప్తించినట్టు వెల్లడైంది.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇలా..
హర్యానాలోని నుహ్ సిటీలో ముస్లిం జనాభా అధికం. నుహ్ మీదుగా జూలై 31న విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర వెళ్లనున్నది. యాత్రకు ఒక రోజు ముందు బిట్టు భజరంగీ అనే స్వయం ప్రకటిత గో సంరక్షుడు “నుహ్‌లో జరిగే యాత్రలో పాల్గొంటాను. మేవాత్ కూడా వస్తున్నారు. తుపాకీ తూటాలు పేలతాయి.. తండ్రి తండ్రిగానే మిగులు తాడు” అనే సాహిత్యం ఉన్న పాటతో పాటు కాషాయ వేషధారణలో నడుస్తూ వస్తున్నట్టు చిత్రీకరించే స్లో-మోషన్ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్‌చేశాడు.
“మీ బావగారు 150 కార్ల కాన్వాయ్‌తో వస్తున్నారు. దండలు సిద్ధంగా ఉంచుకోండి. నేను వచ్చిన విషయాన్ని మా అత్తమామలకు చెప్పలేదని తర్వాత ఫిర్యాదు చేయవద్దు” అని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉన్న వీడియోను పోస్టు చేశాడు. మరో భగరంగ్ దళ్ నేత మోను మనేసర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను కూడా పోస్టు చేశాడు భజరంగీ. మరికొన్నిరెచ్చగొట్టే, బెదిరించే వీడియోలను కూడా షేర్ చేశాడు
నిందితులపై కేసులు
భజరంగీ, అతని సహచరులపై ఫరీదాబాద్‌లోని ధౌజ్ పోలీసులు నెల రోజుల క్రితమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మతపరమైన అశాంతిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినందుకు, ఆయుధాలు ప్రయోగించి, ముస్లింలను కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు కేసు పెట్టారు. అలాగే ఫిబ్రవరిలో జరిగిన ఇద్దరు ముస్లిం యువకుల హత్య కేసులో ప్రధాన నిందితుల్లో మోను మనేసర్ ఒకరు.
ఆరు నెలలు తప్పించుకొని తిరుగుతున్నాడు. నుహ్ యాత్ర సందర్భంగా వీరి రెచ్చగొట్టే వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. జూలై 31న నుహ్ సిటీ సమీపంలోని గురుగ్రామ్ – అల్వార్ జాతీయ రహదారిపైకి వీహెచ్‌పీ యాత్ర చేరుకోగానే ఘర్షణ మొదలైంది.
ఢిల్లీకి పాకిన మత ఘర్షణలు
జూలై 31న నుహ్‌లో మొదలైన హింసాకాండ హర్యానా రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించింది. ఇద్దరు హోంగార్డులతో సహా ఆరుగురి మరణానికి దారితీసింది. ఢిల్లీకి దగ్గరగా ఉన్న పల్వాల్, ఫరీదాబాద్, గురుగ్రామ్‌లలో హింస, దహన ఘటనలకు కారణమైంది.
ఇప్పటివరకు 116 మందిని అరెస్టు చేశామని, 90 మందిని అదుపులోకి తీసుకున్నామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ బుధవారం తెలిపారు.