Kuwait | కువైట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. 41 మంది స‌జీవ‌ద‌హ‌నం

కువైట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున ఎగిసిప‌డ్డ అగ్నికీల‌ల్లో చిక్కుకొని 41 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు

Kuwait | కువైట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. 41 మంది స‌జీవ‌ద‌హ‌నం
కువైట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున ఎగిసిప‌డ్డ అగ్నికీల‌ల్లో చిక్కుకొని 41 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. తీవ్ర గాయాల‌పాలైన వారిని స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు పేర్కొన్నారు. మృతుల్లో న‌లుగురు భారతీయులు ఉన్న‌ట్లు స‌మాచారం. ఇద్ద‌రు త‌మిళ‌నాడుకు చెందిన వారు కాగా, మ‌రో ఇద్ద‌రు నార్త్ ఇండియాకు చెందిన వార‌ని కువైట్ మీడియా పేర్కొంది.

అయితే బుధ‌వారం తెల్ల‌వారుజామున 4.30 గంట‌ల‌కు ఓ బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నంలో మంట‌లు చెల‌రేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కిచెన్‌లో నుంచి మంట‌లు ఎగిసిప‌డిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో మంట‌ల నుంచి త‌ప్పించుకునేందుకు చాలా మంది భ‌వ‌నంలో నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు పెట్టారు. అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసింది.
ఆ బిల్డింగ్ ఇండియా వ్యాపార‌వేత్త‌ది..
అయితే అగ్నిప్ర‌మాదం జ‌రిగిన భ‌వ‌నం.. ఇండియాకు చెందిన ఓ వ్యాపార‌వేత్త‌ది అని జాతీయ మీడియాల్లో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఆ బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నంలో దాదాపు 195 మంది కార్మికులు ఉంటార‌ని స‌మాచారం. వారంతా స్థానికంగా ప‌ని చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. కేజీ అబ్ర‌హం అనే వ్య‌క్తి ఆధీనంలో బిల్డింగ్ ఉన్న‌ట్లు స‌మాచారం. ఈయ‌న మ‌ల‌యాళీ బిజినెస్‌మెన్