న్యూయార్క్ : అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో ఒక హృదయ విదారక వీడియో వెలుగులోకి వచ్చింది. కనబడుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి ఒక మహిళను అతి దారుణంగా కొట్టాడు. నిందితుడు అంతటితో ఆగకుండా ఆ మహిళ మెడకు బెల్ట్ చుట్టి ఒక్క కుదుపుతో కిందపడేలా చేశాడు. ఆ తరువాత ఆ వ్యక్తి ఆ మహిళను ఈడ్చుకెళ్ళి అత్యాచారానికి కూడా పాల్పడ్డాడు . ఈ ఘటన అంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా మీడియా రిపోర్టుల ప్రకారం ఈ ఘటన మే 1న జరిగింది. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఇంకా నిందితుడిని గుర్తించలేదు. ఆ మహిళ న్యూయార్క్ లోని బ్రోంక్స్ లో నడుచుకొంటూ తన దారిలో తానూ పోతున్నపుడు ఈ సంఘటన చోటుచేసుకొన్నది. పోలీసుల రిపోర్ట్ ప్రకారం నిందితుడు ఆ మహిళను వెనుక నుంచి దాడి చేసాడు. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ సంఘటనకు పాల్పడినప్పుడు నిందితుడు తెల్లటి గుడ్డతో తన నోరుని, తన ముఖాన్ని గుర్తించకుండా కప్పుకున్నాడు. నిందితుడు మహిళపై ముందుగా మెరుపు దాడి చేసి ఆ తర్వాత దారుణంగా ఆమెను హింసించాడు. బాధితురాలి మెడకు ముందుగా బెల్టుని గట్టిగా బిగించాడు. ఆ సమయంలో మహిళ నిందితుడిపై ఎదురు దాడి చేస్తూ తనని తాను రక్షించుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. అయితే బెల్టు గట్టిగా బిగించి ఉండడంతో ఆ మహిళ ఎక్కువసేపు అతనితో ఎదురు దాడి చేయలేక కొద్ది సమయంలోనే స్పృహ తప్పి పడిపోయింది. నిందితుడు అపస్మారక స్థితిలో ఉన్న మహిళను దగ్గరలో గల కారు పార్కింగ్ లోకి ఈడ్చుకెళ్ళాడు. అక్కడ రెండు కార్ల మధ్య ఆ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. తెలిసిన సమాచారం ప్రకారం దాడికి ముందు నిందితుడు ఆ మహిళతో మాట్లాడాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడి ప్రొఫైల్ ను విడుదల చేశారు. నిందితుడి ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. దాడి చేసిన సమయంలో అతను నలుపు రంగు చొక్కా తెలుపు రంగు ప్యాంటు ధరించాడు. ప్రస్తుతం న్యూయార్క్ పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.