Montana Plane Crash | పార్కింగ్ విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం !
అమెరికాలో మరో విమాన ప్రమాదం… ల్యాండింగ్ సమయంలో చిన్న విమానం పార్క్ చేసిన విమానంపై దూసుకెళ్లి భారీగా మంటలు చెలరేగాయి!

Montana Plane Crash | విధాత : అమెరికాలో ఇటీవల విమాన ప్రమాదాలు పెరిగిపోగా..తాజాగా ఓ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకున్న విమాన ప్రమాదం వైరల్ గా మారింది. పార్కింగ్ చేసిన విమానంపైకి మరో చిన్న విమానం దూసుకెళ్లిన ఘటనతో భారీగా మంటలు చెలరేగి విమానం ధ్వంసమైంది. మెంటానాలోని కాలిస్పెల్ సిటీలోని విమానాశ్రయంలో టీబీఎం 700టర్బోప్రాప్ విమానాన్ని పైలట్ ల్యాండింగ్ కు ప్రయత్నించాడు. రన్ వే చివర క్రాష్ ల్యాండ్ జరిగి అక్కడే పార్క్ చేసిన విమానంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భారీగా మంటలు చెలరేగాయి.
అదృష్టవశాత్తు విమానంలోని పైలట్ సహా నలుగురు ప్రయాణికులు వెంటనే బయటకు రావడంలో వారు ప్రాణాలలో బయటపడ్డారు. ప్రమాద ఘటపై దర్యాప్తు చేస్తున్నామని ఫెడరల్ ఏవీయేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి…
క్రేజీ ఆఫర్స్ తో రితికా నాయక్ జోరు!
బీఆరెస్ పక్కలో ‘విలీన’ బల్లెం! ముగ్గురు ముఖ్య నేతలకు కాల పరీక్ష!