విధాత : అఫ్రికా అడవులు సింహాలు..అనకొండలకు ప్రసిద్ది. దట్టమైన ఆఫ్రికా అడవుల్లో ఓ అనకొండను నాలుగు ఆడ సింహాలు వేటాడిన దృశ్యం..వాటి మధ్య సాగిన పోరాటం వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.
సూర్యాస్తమయ సమయంలో ఆడ సింహాల గుంపు చెట్ల మద్య సాగిపోతున్న అనకొండను గమనించి దానిపై దాడికి దిగాయి. అయితే అనకొండ తన భారీ ఆకారంతో ..పెద్దదైన నోరును తెరస్తూ సింహాల గుంపుపై ఎదురుదాడికి దిగి బెదరగొట్టి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసింది. వాటి మధ్య నేలపై సాగిన ఘర్షణతో లేచిన దుమ్ము మధ్య పాము భీకరంగా పైకి లేచి ఆత్మరక్షణ పోరాటం కొనసాగించింది. అయితే అనకొండ ఎంతగా పోరాటం చేసినా.. సింహాలు పాము దాడిని కాచుకుంటూ దానిని తలో వైపు చుట్టుముట్టేశాయి. అదును చూసి ఓ సింహం అనకొండ తల భాగాన్ని నోట బంధించగా.. మిగతా సింహాలు ఆ పాముపై తలో చోట దాడి చేసి చంపి ఆహారంగా మలుచుకున్నాయి.
ఆఫ్రికా అడవిలో వన్యప్రాణులు మనుగడ ఎప్పుడూ సులభం కాదు. ప్రతి జంతువు వేటలోనూ ప్రమాదం, సహనం, వ్యూహాలు, స్థలం ప్రముఖ పాత్ర పోషిస్తుంటాయి. అక్కడ ఒక తప్పుడు అడుగు ప్రతీదాన్నీ మార్చేస్తుంది. ఇదే ఆఫ్రికా అడవి సహజ ప్రత్యేకత. అక్కడ వన్యప్రాణుల మధ్య జరిగే ప్రతి పరిణామాం వాటి మనుగడ కథను చాటేదిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Raw Africa in its purest form. As golden sunset light covers the savannah, a pride of lions cautiously surrounds a snake, carefully studying every movement before making a move. In the African wild, survival is never simple—every hunt comes with risk, patience, and strategy. Even… pic.twitter.com/V6Ld495w6R
— Nature Chapter (@NatureChapter) May 8, 2026
