Australian cricketer death| బాల్ తగిలి ఆస్ట్రేలియన్ యంగ్ క్రికెటర్ మృతి

అస్ట్రేలియా క్రికెట్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ వార్మప్ మ్యాచ్ ఆడుతున్న 17ఏళ్ల యంగ్ క్రికెటర్ బెన్ ఆస్టిన్మెడకు బాల్ బలంగా తాకడంతో మృతి చెందడం కలిచివేసింది.

Australian cricketer death| బాల్ తగిలి ఆస్ట్రేలియన్ యంగ్ క్రికెటర్ మృతి

న్యూఢిల్లీ : అస్ట్రేలియా క్రికెట్ (Australia, Cricket)లో విషాదకర (Tragic Incident)ఘటన చోటుచేసుకుంది. ఓ వార్మప్ మ్యాచ్ ఆడుతున్న 17ఏళ్ల యంగ్ క్రికెటర్ బెన్ ఆస్టిన్(Ben Austin death) మెడకు బాల్ బలంగా తాకడంతో మృతి చెందడం కలిచివేసింది. 11ఏళ్ల క్రితం యంగ్ క్రికెటర్ ఫిల్‌ హ్యూస్‌ మైదానంలోనే ప్రాణాలు వదిలిన ఘటనను అస్ట్రేలియా క్రికెట్ అభిమానులను నేటికి కలవరపెడుతున్న క్రమంలో మరో యంగ్ క్రికెటర్ మైదానంలో గాయపడి మరణించడం వారిని మరింత ఆందోళనకు గురి చేసింది. మెల్‌బోర్న్‌కు చెందిన బెన్ అస్టిన్ టీ20 మ్యాచ్‌ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఫెర్న్‌ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ నుంచి లోకల్ టీ20 మ్యాచ్‌కు ముందు వార్మప్ చేస్తుండగా బెన్ ఆస్టిన్(17) మెడకు బాల్ బలంగా తాకింది. దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో రెండు రోజులు మృత్యువుతో పోరాడిన బెన్ ఆస్టిన్ గురువారం కన్నుమూశాడు.

ప్రాక్టీస్‌ సమయంలోనూ అతడు తలకు హెల్మెట్‌ పెట్టుకొని ఉన్నట్లు అక్కడి క్రికెట్ వర్గాలు తెలిపాయి. దీనిపై ఫెర్న్ ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ ఓ ప్రకటనలో విడుదల చేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆస్టిన్ బెన్ మైదానంలో గాయపడి చనిపోవడం దిగ్భ్రాంతి కల్గించిందని పేర్కొంది. బెన్ క్రికెట్‌ కాకుండా ఫుట్‌బాల్ మ్యాచులు కూడా ఆడేవాడని..అతని ఆకస్మిక మరణం మా క్రికెట్ కమ్యూనిటీపై ప్రభావం చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో బెన్ కుటుంబం గోప్యతకు భంగం కలిగించవద్దని కోరుతున్నాం అని ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.