PM Russia tour | ప్రధాని రష్యా పర్యటనలో కీలక పరిణామం.. అదేమిటంటే..!

PM Russia tour | ప్రధాని నరేంద్రమోదీ రష్యా పర్యటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడి సైన్యం నుంచి భారత సైనికులకు విముక్తి లభించింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను డిశ్చార్జ్‌ చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అంగీకరించారు. భారత్‌కు చెందిన వందలాది మంది సైనికులు రష్యా ఆర్మీలో దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. గతంలో రష్యాకు బందీలుగా పట్టుబడ్డ భారతీయులను బలవంతంగా సైన్యంలో చేర్చి వారి సేవలను వాడుకుంటున్నారు.

PM Russia tour | ప్రధాని రష్యా పర్యటనలో కీలక పరిణామం.. అదేమిటంటే..!

PM Russia tour : ప్రధాని నరేంద్రమోదీ రష్యా పర్యటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడి సైన్యం నుంచి భారత సైనికులకు విముక్తి లభించింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను డిశ్చార్జ్‌ చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అంగీకరించారు. భారత్‌కు చెందిన వందలాది మంది సైనికులు రష్యా ఆర్మీలో దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. గతంలో రష్యాకు బందీలుగా పట్టుబడ్డ భారతీయులను బలవంతంగా సైన్యంలో చేర్చి వారి సేవలను వాడుకుంటున్నారు.

ఈ అంశంపై గత కొన్నాళ్లుగా వివాదం కొనసాగుతోంది. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధంలో కొందరు భారత సైనికులు చనిపోవడంతో వారిని విడిపించాలంటూ భారత ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దాంతో రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పుతిన్.. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులందరినీ డిశ్చార్జ్ చేయాలని ఆదేశించారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో తాజాగా ఇద్దరు భారతీయులు చనిపోయారు.

అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భూమిలో చిక్కుకున్న డజన్ల కొద్దీ భారతీయ సైనికులు అక్కడ పోరాడేందుకు అయిష్టంగా ఉన్నారు. దాంతో ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్, హర్యానాకు చెందిన కొందరు భారతీయ సైనికులు.. ఉక్రెయిన్ యుద్దంలో తాము మోసపోయినట్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అలాగే తమకు సాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. దాంతో ఎట్టకేలకు కేంద్రం రష్యాతో సంప్రదింపుల ద్వారా వీరికి విముక్తి కల్పించింది.

అదేవిధంగా తప్పుడు సాకులు, హామీలతో భారతీయులను రష్యా సైన్యంలో రిక్రూట్ చేసిన ఏజెంట్లు, అసాంఘిక శక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది. భారత దర్యాప్తు సంస్థలు కూడా దాడులు నిర్వహించి రష్యాకు భారతీయులను అక్రమ రవాణా చేస్తున్న రింగ్‌ను ఛేదించాయి. యుద్ధం సమయంలో ఈ సంస్థలు కనీసం 35 మంది భారతీయులను రష్యాకు పంపినట్లు బయటపడింది. అయితే వీరంతా ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్నారా.. లేదా..? అన్నది నిర్దారణ కాలేదు.