Congo | గనిలో కూలిన వంతెన.. 32 మంది మృతి
రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ దేశంలో ఓ రాగి గనిలో ఉన్న వంతెన కూలిపోవడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. నవంబర్ 15(శనివారం) రోజున లువాలాబా ప్రావిన్స్‌లో ఉన్న కలాండో రాగి గనిలో వంతెన కూలిపోవడంతో సుమారు 32 మంది కార్మికులు మృతి చెందారు.
రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ దేశంలో ఓ రాగి గనిలో ఉన్న వంతెన కూలిపోవడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. నవంబర్ 15(శనివారం) రోజున లువాలాబా ప్రావిన్స్‌లో ఉన్న కలాండో రాగి గనిలో వంతెన కూలిపోవడంతో సుమారు 32 మంది కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో చాలామందికా గాయాలయ్యాయి. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాలు..సమాచారం ప్రకారం.. మైనింగ్ వద్ద కాల్పుల శబ్దం వినిపించడంతో కార్మికులు ఇరుకైన వంతెనపై పరుగులు తీస్తుండగా అది కుప్పకూలిందని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, ఈ సంవత్సరం కాంగోలో జరిగిన అత్యంత ప్రాణాంతకమైన మైనింగ్ ప్రమాదాలలో కలాండో రాగి గని ప్రమాదంగా పరిగణిస్తున్నారు. ఈ ఘటనలో 32 మంది చనిపోవడమే ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. లక్షలాది మందికి ఉపాధి ఇస్తున్న ఈ మైనింగ్ ప్రాంతంలో భద్రతా చర్యలు సరిగ్గా లేక గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అప్పుడు జరిగిన ప్రమాదాల్లో కూడా పదుల సంఖ్యలో ప్రమాదాలు సంభవించినట్లు సమాచారం.
అయితే, ఈ ప్రమదంలో ఇంకా చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే, గాయపడ్డవారిలో 20 మందికి పైగా తీవ్రమైన స్థితిలో ఆస్పత్రిలో చేరారని అధికారులు వెల్లడించారు. అలాగే, కాంగో దేశం మంత్రి రాయ్ కౌంబా ఇప్పటివరకు 32 మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టాలని మానవ హక్కుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
Horror in Kawama, Lualaba, Democratic Republic of the Congo yesterday.
A massive landslide at an artisanal mine reportedly killed at least 70 people. Some of the images are too graphic to share. pic.twitter.com/zGFvm45boU
— Volcaholic 🌋 (@volcaholic1) November 16, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram