కుప్పకూలిన గోల్డ్ మైన్ ..100మందికి పైగా సజీవ సమాధి

అఫ్రికా దేశమైన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో ఓ బంగారు గని అకస్మాత్తుగా కుప్పకూలిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాద సమయంలో పని చేస్తున్న 100 మందికిపైగా కార్మికులు గని మట్టి, రాళ్ల శిధిలాల కింద చిక్కుకుపోయి సజీవ సమాధి అయినట్లుగా మైనింగ్ అధికారులు ధ్రువీకరించారు.

అఫ్రికా దేశమైన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో ఓ బంగారు గని అకస్మాత్తుగా కుప్పకూలిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాద సమయంలో పని చేస్తున్న 100 మందికిపైగా కార్మికులు గని మట్టి, రాళ్ల శిధిలాల కింద చిక్కుకుపోయి సజీవ సమాధి అయినట్లుగా మైనింగ్ అధికారులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురి ఆచూకీ ఇంకా లభ్యం కావాల్సి ఉంది. దీంతో ప్రాణనష్టం మరింత భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరణించిన వారిలో ఎక్కువ మంది మైనర్లు, యువకులే ఉన్నారని అధికార వర్గాల సమాచారం.

కెమరూన్‌ సరిహద్దుకు సమీపంలోని నానా-మాంబెరే ప్రిఫెక్చర్‌లో జాంబోయే గ్రామం ఉంది. అక్కడ చిన్న స్థాయిలో సంప్రదాయ పద్ధతిలో బంగారం తవ్వుతున్న గని కూలిపోయింది. మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌లో ఇలాంటి చిన్నస్థాయి గనులు కూలిపోవడం తరచూ జరుగుతోంది. వేలాది మంది ఇలాంటి గనుల్లో పని చేస్తున్నారు. సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో ఇలాంటి గని ప్రమాదాలు తరచూ ప్రాణనష్టానికి దారితీస్తున్నాయి.

కుటుంబాలను కష్టాల నుంచి గట్టెక్కించాలనే ఆశతో గనులకు వచ్చిన యువతీయువకులు ఇలా ప్రాణాలు కోల్పోవడం చూస్తుంటే ఎంతో బాధగా ఉంది” అని జాంబోయే యువజన మండలి సభ్యుడు బెర్ట్రాండ్‌ బే యాంగ్వే ఆవేదన వ్యక్తం చేశారు. గని ఎందుకు కూలిందో తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. మృతులను గుర్తించడంతో పాటు గని నిర్వహణకు బాధ్యులెవరో, ఈ ఘటనలో నేరపరమైన బాధ్యత ఏమైనా ఉందో పరిశీలిస్తున్నట్లు బబోవా ఉపప్రాంత కోర్టు ప్రాసిక్యూటర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

 

Latest News