Humanoid Robots Boxing : బాక్సింగ్ బరిలో చైనీస్ రోబోలు..పంచ్ లతో ఫైర్

చైనాలో హ్యూమనాయిడ్ రోబోలు బాక్సింగ్ రింగులో తలపడి అబ్బురపరిచాయి. షెన్‌జెన్ రోబోటిక్స్ ఎక్స్‌పోలో జరిగిన ఈ పోరులో రోబోలు నిమిషానికి 20 పంచ్‌లతో చెలరేగిపోయాయి.

Humanoid Robots Boxing : బాక్సింగ్ బరిలో చైనీస్ రోబోలు..పంచ్ లతో ఫైర్

విధాత : రోబోటిక్ వినియోగంలో చైనా దూసుకెలుతుంది. అంతరిక్ష..విపత్తుల సహాయక రంగాలలో, వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లోనే కాకుండా క్రీడలు..ట్రాఫిక్ విధులలోనూ హ్యుమనాయిడ్ రోబోలను వినియోగిస్తూ..రోబోల వినియోగంలో ప్రపంచంలో మేటిగా కొనసాగుతుంది. ఇటీవల ఓ డాన్స్ షోలో చైనీస్ రోబోలు నిపుణులైన డాన్సర్లతో పోటీపడుతూ వేసిన స్టెప్పులకు ప్రపంచం ఆశ్చర్యపోయింది. చైనాలో రోబోలకు అద్లెటిక్ పోటీలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ బాక్సింగ్ పోటీలో చైనా హ్యూమనాయిడ్ రోబోలు పోటీ పడిన వీడియో వైరల్ గా మారింది.

చైనీస్ హ్యూమనాయిడ్ రోబోలు జియావో హీ (నలుపు), జియావో లూ (ఆకుపచ్చ) షెన్‌జెన్‌లోని జున్‌క్సియాంగ్ రోబోటిక్స్ ఎక్స్‌పోలో స్టేజ్ బాక్సింగ్ మ్యాచ్‌లో తలపడిన దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య రెండు రోబోలు పరస్పరం డైనమిక్ పంచ్‌లు, డాడ్జ్‌లు, ఫాల్స్‌ను ప్రదర్శిస్తూ..నిజమైన బాక్సింగ్ యోధుల వలే పోరాడిన తీరు విస్మయపరిచింది. ఇది రోబోల రియల్-టైమ్ మోటార్ కంట్రోల్, బ్యాలెన్స్ అల్గారిథమ్‌ల నైపుణ్యాలకు నిదర్శనంగా నిలిచింది. ఈ పోటీలలో రోబోలు నిమిషానికి 20 పంచ్‌ల వరకు విసరడం గమనార్హం. రోబోటిక్ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా ఈ రోబోటిక్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

Uttam Kumar Reddy : పాలమూరు రంగారెడ్డికి 90టీఎంసీలే మా విధానం
Ashu Reddy | హాట్ అలర్ట్.. గ్లామర్ షోతో మతిపోగొడుతున్న ఆషు రెడ్డి