ISS: ఐఎస్ఎస్‌పై మస్క్ ప్రపోజల్‌ను కొట్టిపడేసిన సునీతా విలియమ్స్.. ఇంతకీ ఆమె అభిప్రాయం ఏమిటి?
ఐఎస్ఎస్‌కు 2030 నాటికి మూసివేయాలని నాసా ప్లాన్స్ తయారు చేస్తున్నది. నియంత్రిత విధానంలో దీనిని పసిఫిక్ మహాసముద్రంలో కూల్చివేయనున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో జనావాసాలకు ఇబ్బంది లేని పాయింట్ నేమో గా గుర్తించిన ప్రాంతంలో దీనిని సురక్షితంగా దించనున్నారు.

ISS: ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ దేశాలకు అంతరిక్ష సేవలందిస్తున్నది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. 2000 సంవత్సరం నుంచి నిరంతరం పనిలో ఉంటున్న ఐఎస్ ఎస్ కాలపరిమితిని 2030గా మొదట్లో నిర్ణయించారు. ఈ స్పేస్ స్టేషన్ నుంచి నాసాతోపాటు రోస్కోస్‌మాస్ (రష్యా), ఈఎస్ఏ (యూరోప్), జాక్సా (జపాన్), సీఎస్ఏ (కెనడా) అంతరిక్ష సంస్థల పరిశోధనలకు వేదికగా ఉంటూ వస్తున్నది. 1998లో తొలి మాడ్యూల్‌ను ప్రారంభించగా, తదుపరి సంవత్సరాల్లో 16 ప్రెజరైజ్డ్ మాడ్యూల్స్ సహా ఇతరత్రా విస్తరిస్తూ వచ్చారు. ఐఎస్ఎస్ ఇప్పటికీ ఆపరేషన్స్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ.. వయో భారం కూడా ఒక సమస్యగా ఉన్నది. నిర్మాణాత్మక తరుగుదలలు, అప్పుడప్పుడు చోటు చేసుకుంటున్న ఎయిర్ లీకేజీలు, పెరుగుతున్న నిర్వహణ భారం వంటివాటితో దానిపై చర్చోప చర్చలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ అనుకున్న సమయానికంటే ముందుగానే ఐఎస్ఎస్‌ను కిందికి దించేయాలని ప్రతిపాదించారు. రెండేళ్లలోనే ఈ ప్రక్రియ ముగించాలని అన్నారు. ఐఎస్ఎస్ నుంచి లో ఎర్త్ ఆర్బిట్‌లో నిత్యం మానవులు కొనసాగేలా కమర్షియల్ స్పేస్ స్టేషన్లవైపు క్రమంగా మారేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాఖ్యానించారు.
అయితే.. ఆయన ప్రతిపాదనను భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ బహిరంగంగానే తిరస్కరించారు. ఐఎస్ ఎస్ నుంచి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. స్పేస్ స్టేషన్ అందిస్తున్న శాస్త్రీయ సేవలను నొక్కి చెప్పారు. త్వరగా దీనిని మూసేయాలన్న నిర్ణయం సరైనది కాదని స్పష్టం చేశారు. ఐఎస్ఎస్‌కు 2030 నాటికి మూసివేయాలని నాసా ప్లాన్స్ తయారు చేస్తున్నది. నియంత్రిత విధానంలో దీనిని పసిఫిక్ మహాసముద్రంలో కూల్చివేయనున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో జనావాసాలకు ఇబ్బంది లేని పాయింట్ నేమో గా గుర్తించిన ప్రాంతంలో దీనిని సురక్షితంగా దించనున్నారు. చాలా తక్కువ స్థాయిలోనే ఉపయోపడుతున్నదని చెబుతూ.. దీనిని కిందికి దించే ప్రక్రియను వేగవంతంగా చేయాలని మస్క్ ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రతిపాదన అంతరిక్ష పరిశోధన, అంతర్జాతీయ సహకారం, కమర్షియల్ స్పేస్ స్టేషన్ల ట్రాన్సిషన్ భవితవ్యంపై పెద్ద ఎత్తున చర్చలు లేవదీసింది.
పెద్దగా ఉపయోగపడటం లేదన్న వాదనను సునీతతోపాటు.. పలువురు నాసా శాస్త్రవేత్తలు సైతం తిరస్కరిస్తున్నారు. శాస్త్రీయ ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతికి ఇంకా ఐఎస్ ఎస్ కీలకంగానే ఉన్నదని స్పష్టం చేస్తున్నారు. ఐఎస్ ఎస్ నుంచి నిర్వహించిన మీడియా సమావేశంలో సునీత మాట్లాడుతూ.. స్పేస్ స్టేషన్ పరిస్థితి, దాని భవితవ్యంపై అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. ఈ ప్రదేశం చాలా ఆకర్షణీయంగా, అద్భుతంగా ఉన్నదని తెలిపారు. ఇక్కడ తాము చాలా ఉత్సాహంగా ఉన్నామని చెప్పారు. ఇందులోని అన్ని సౌకర్యాలూ బాగా పనిచేస్తున్నాయని చెబుతూ.. ఇప్పుడు దీనిని మూసేయాలనడం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ఐఎస్ ఎస్‌లో జరుగుతున్న వైద్య పరమైన పరిశోధనలు, మెటీరియల్స్ సైన్స్, స్పేస్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సహా వివిధ కీలక పరిశోధనలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. 2030 నాటికి దీనిని క్లోజ్ చేయాలన్న నిర్ణయం సరైనదే అవుతుందని చెప్పారు. పన్ను చెల్లింపుదారులు, ఇంటర్నేషనల్ పార్ట్‌నర్స్‌కు ఈ అంతరిక్ష కేంద్రం నుంచి మరిన్ని ప్రయోజనాలు అందాల్సి ఉన్నదని తెలిపారు.