Baby Grok| పిల్లల కోసం ‘బేబీ గ్రోక్’ యాప్

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఏఐ చాట్ బాట్ అప్లికేషన్ రూపొందించనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో 'బేబీ గ్రోక్' యాప్ ను తీసుకురానున్నట్లు మస్క్ ఎక్స్ లో వెల్లడించారు

Baby Grok| పిల్లల కోసం ‘బేబీ గ్రోక్’ యాప్

Baby Grok|

విధాత : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోకీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఏఐ చాట్ బాట్ అప్లికేషన్ రూపొందించనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ‘బేబీ గ్రోక్’ యాప్ ను తీసుకురానున్నట్లు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్వయంగా ఎక్స్ లో వెల్లడించారు. సెక్సువలైజ్డ్ క్యారెక్టర్ ‘ఏఎన్ఐ’ యానిమ్ పిల్లలపై తీవ్ర దుష్రచారం చూపుతున్నదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో చిన్న పిల్లలకు సురక్షితమైన కంటెంట్ ను అందించేందుకు ‘బేబీ గ్రోక్’యాప్ ను రూపొందిస్తున్నట్లు మస్క్ ప్రకటించారు.

ఇది ‘ఎక్స్‌ఏఐ’ ఫ్లాగ్ షిప్ మోడల్ అయిన గ్రోక్ ను కిడ్ ఫ్రెండ్లీ వెర్షన్ గా అభివృద్ధి చేస్తున్నారు. పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రత్యేకంగా రూపొందించనున్నట్లు సమాచారం. అయితే, ‘బేబీ గ్రోక్’ యాప్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఎలాన్ మస్క్ వెల్లడించలేదు. అయితే, ఎక్స్ ఫ్లాట్ ఫామ్ లో స్పామ్ సమస్యల నేపథ్యంలో గ్రోక్ ప్రస్తావనలను తాత్కాలికంగా నిలిపివేసిన కొన్ని రోజులకే మస్క్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

అలాగే గ్రోక్ ను మరింత మెరుగు పర్చడానికి మస్క్ ఇప్పటికే చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పిల్లలు ఏఐ వినియోగించడం పెరుగుతోంది. ఓ అధ్యయనం ప్రకారం 44శాతం మంది పిల్లలు జనరేటివ్ ఏఐను వాడుతున్నట్లు వెల్లడైంది. ఇందులో 54 శాతం మంది పిల్లలు తమ పాఠశాల లేదా హోమ్ వర్క్ కోసం ఏఐను వినియోగిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో పిల్లలకు ఏఐ వినియోగంలో సరైన దారిలో ఉంచడానికి బేబీ గ్రోక్ తీసుకురానున్నారు. మరోవైపు గూగుల్ కూడా చైల్ట్ ఫ్రెండ్లీ ఏఐ యాప్ తీసుకొస్తోంది.

చిన్నారి స్ప్రింగా… రబ్బర్ పిల్లనా..!?
Priyanka Chopra Birthday Vacation | మాల్ధీవులలో రెచ్చిపోయిన ప్రియాంకా చోప్రా జంట