Global AI Race | యూఎస్, చైనా తరువాత మనమే.. ఏఐలో దూసుకుపోతున్న భారత్
వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా ప్రకారం వచ్చే ఐదు సంవత్సరాలలో 38 శాతం నిపుణులైన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఏఐ లో మమేకమై పనిచేస్తారు. ప్రపంచ ఏఐ రంగంలో భారత్ హబ్ గా మారే పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి.
Global AI Race | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) లో అమెరికా, చైనా తరువాతి స్థానంలో భారత్ పోటీపడుతోందని ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నివేదిక వెల్లడించింది. ప్రపంచ ఏఐలో భారత్ వేగంగా ముందుకు సాగుతోందని ప్రకటించింది. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం యూఎస్ లో 78.6, చైనా లో 36.95 స్కోర్ నమోదు కాగా భారత్ లో 21.59 స్కోర్ నమోదు అయ్యింది. రెండు దేశాల తరువాత తక్కువ స్కోర్ ఉన్నప్పటికీ, పోటీపడుతుండడం విశేషంగా చెప్పుకోవాలి. దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్, యూకే, జర్మనీ దేశాలతో పోల్చితే న్యూఢిల్లీ స్కోర్ అధికంగా ఉండడం గమనార్హం.
నైపుణ్యం కలిగిన వారు ఉండడం, పరిశోధన, అభివృద్ధి, పెట్టుబడులు, ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక అంశాలు భారత్ లో ఏఐ పురోగతికి తోడ్పడుతున్న అంశాలు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రపంచ టెక్ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయని, ఏఐ రంగంలో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపింది. ఏఐలో 2030 నాటికి ఏఐ లాజిస్టిక్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలలో 35 బిలియన్ డాలర్లు పెట్టనున్నట్లు అమెజాన్ ప్రకటించిన విషయం విదితమే. ఏఐ క్లౌడ్ రంగంలో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇటీవలే భారత్ వచ్చిన మైక్రోసాఫ్ట్ సీఈఓ నాదెళ్ల సత్య ప్రకటించారు కూడా. అంతకు ముందు ఇంటెల్, కాగ్నిజెంట్, ఓపెన్ ఏఐ తమ పెట్టుబడుల వివరాలు వెల్లడించాయి. యూఎస్, చైనా తరువాత ఏఐ పురోగతిలో భారత్ ఉండడంతో మరికొన్ని అంతర్జాతీయ టెక్ కంపెనీలు భారీ పెట్టుబడుల ప్రణాళికలు ప్రకటించే సూచనలు ఉన్నాయి.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా ప్రకారం వచ్చే ఐదు సంవత్సరాలలో 38 శాతం నిపుణులైన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఏఐ లో మమేకమై పనిచేస్తారు. ప్రపంచ ఏఐ రంగంలో భారత్ హబ్ గా మారే పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి.
Read Also |
ఆస్ట్రేలియా బీచ్‌లో కాల్పుల కలకలం.. 12 మంది మృతి
Groundwater Overuse | టర్కీ పొలాలను నాశనం చేస్తున్న వందల కొద్దీ గుంతలు.. ప్రపంచానికి హెచ్చరిక!
Vastu Tips | ఈ మూడు వస్తువులు మీ ఇంట్లో ఉంటే.. కోటీశ్వరులైపోతారట..!
Health Tips | గుడ్డులోని పచ్చసొన తినడం వల్ల గుండెపోటు వస్తుందా..? ఎంత వరకు నిజం..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram