Friendship Marriage | పెళ్లికి సై.. కాపురానికి నై..! జపాన్‌లో ట్రెండింగ్‌లో ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్‌..!

Friendship Marriage | జపాన్‌లో ఫ్రెండ్‌షిప్‌ మార్యేజ్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌ మారింది. యువతీ యువకులు సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. కలిసి జీవించేందుకు సైతం సిద్ధపడుతున్నారు. కానీ, కాపురం విషయం వచ్చే వరకు మాత్రం కుదరదని తెగేసి చెబుతున్నారు.

Friendship Marriage | పెళ్లికి సై.. కాపురానికి నై..! జపాన్‌లో ట్రెండింగ్‌లో ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్‌..!

Friendship Marriage | జపాన్‌లో ఫ్రెండ్‌షిప్‌ మార్యేజ్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌ మారింది. యువతీ యువకులు సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. కలిసి జీవించేందుకు సైతం సిద్ధపడుతున్నారు. కానీ, కాపురం విషయం వచ్చే వరకు మాత్రం కుదరదని తెగేసి చెబుతున్నారు. ఈ తరహా పెళ్లిలో ప్రేమ, వైవాహిక జీవితం తప్ప మిగతా మిగతా అంతా ఒకేలా ఉంటుంది. దీనికే ఫ్రెండ్‌షిప్‌ మార్యేజీ అని పేరుపెట్టారు. ప్రస్తుతం ట్రెండింగ్‌ మారగా.. పెళ్లిబంధంతో ఏకమై.. ఆ తర్వాత నచ్చినా.. నచ్చకపోయినా కలిసి కాపురం చేయడం, వ్యక్తిగత జీవితాన్ని కోల్పోవాల్సి రావడం నుంచి వ్యతిరేకంగా పుట్టుకువచ్చేందే ఈ ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్‌. ఈ ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజీ వెనుక కారణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యువతీ యువకులు ఆ విధానంపైనే ఆసక్తి చూపుతున్నారు.

తగ్గిన యువ జనాభా..

ఇటీవల జపాన్‌లో యువత జనాభా సంఖ్య తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి చేరడంతో ఈ విషయంపై ఆరా తీసింది. పెరుగుతున్న ఖర్చులను భరించలేక చాలామంది యువతీ యువకులు దాంపత్య జీవితంపై ముఖం చాటెస్తున్నట్లుగా తేలింది. దాంతో స్పందించిన సర్కారు పెళ్లి చేసుకునేందుకు విముఖత చూపుతున్న యువత దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ముందుకు వస్తున్నది. పెళ్లి చేసుకునే జంటలకు పలు పన్నుల నుంచి బెనిఫిట్స్ ఇవ్వడం, వివిధ సంక్షేమ పథకాలకు పెళ్లి చేసుకున్న వారినే అర్హులుగా చేయడం తదితర చర్యలు తీసుకుంటూ వస్తున్నది. ఈ క్రమంలో ఆయా ప్రయోజనాలను కోల్పోవడం ఇష్టం లేని వారంతా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. అయితే, యువతీ యువకులు ఇష్టం లేకపోయినా మధ్యే మార్గంగా ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ విధానం తెరపైకి వచ్చింది.

ఫ్రెండ్‌షిప్‌ మార్యేజ్‌ ఎలా..?

ఈ ఇది సైతం వివాహబంధమే. అయితే, ఇందులో ప్రేమ, దాంపత్య జీవితానికి తావుండదు. ఫెండ్‌షిప్‌ మ్యారేజ్‌లో పెళ్లి చేసుకున్న యువతీ యువకుడు స్నేహితులుగా మాత్రమే ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించుకుంటూ ఉంటారు. అన్ని పనులను పంచుకుంటూ జీవిస్తారు. అయితే, కృత్రిమ గర్భదారణ పద్ధతిలో మాత్రమే తల్లిదండ్రులుగా మారుతున్నారు. పిల్లల పెంపకం బాధ్యత మాత్రం తల్లిదండ్రులుగా కలిసి చూసుకుంటారు.