Gold , Silver price fall| తగ్గిన ధరలు.. బంగారం, వెండి కొనుగోలుకు ఇదే చాన్స్ !
నూతన సంవత్సరం 2026 జనవరి నెల ప్రారంభంతో ఆల్ టైమ్ రికార్డు ధరలతో పైపైకి దూసుకపోయిన బంగారం, వెండి ధరలు నెల ముగిసిపోయే నాటికి రికార్డు స్థాయిలో దిగివచ్చి కొనుగోలు దారులకు షాక్ ఇచ్చాయి.
విధాత, హైదరాబాద్ : నూతన సంవత్సరం 2026 జనవరి నెల ప్రారంభంతో ఆల్ టైమ్ రికార్డు ధరలతో పైపైకి దూసుకపోయిన బంగారం, వెండి ధరలు నెల ముగిసిపోయే నాటికి రికార్డు స్థాయిలో దిగివచ్చి కొనుగోలు దారులకు షాక్ ఇచ్చాయి. జనవరి 1న రూ.1,35,060గా ఉన్న తులం బంగారం ధర జనవరి 29న ఆల్ టైమ్ రికార్డు రూ. 1లక్ష 78,850కి చేరింది. నెలాఖరున జనవరి 31న రూ.1,60,580కి పడిపోయింది. ఫిబ్రవరి 1 ఆదివారం కూడా అదే ధర వద్ద కొనసాగుతుంది. 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,60,580వద్ద స్థిరంగా ఉంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.147,200వద్ద నిలిచింది.
నిలకడగా వెండి ధరలు
2026 జనవరి నెలలో ఆల్ టైమ్ రికార్డు ధరలతో పైపైకి వెళ్లిపోయిన కిలో వెండి ధరలు జవనరి 31నాటికి అనూహ్య తగ్గుదలను నమోదు చేశాయి. జనవరి 1న రూ.2,56,000గా ఉన్న కిలో వెండి ధర జనవరి 29న ఆల్ టైమ్ రికార్డు ధర రూ.4,25,000 నమోదు చేసింది. జనవరి 31నాటికి రూ.3,20,000కి పడిపోయింది. ఫిబ్రవరి 1 ఆదివారం కూడా కిలో వెండి ధర అదే ధర వద్ద కొనసాగుతుంది. ఒక్క జనవరి నెలలోనే కిలో వెండి ధర రూ.1,69,000పెకి పెరిగి..ఇదే నెలలో 1లక్ష 5వేలు తగ్గిపోవడం వెండి ధరల అనూహ్య పతనాన్ని చాటుతుంది.
ఇదే సరైన చాన్స్ ?
బంగారం, వెండి ధరల అకస్మిక పతనానికి ప్రధాన కారణంగా ఇన్వెస్టర్లు పెరిగిన ధరల వద్ద భారీ లాభార్జనకు దిగడమే కారణమని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇటీవల భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు రికార్డు స్థాయిలకు చేరడంతో పెట్టుబడిదారులు లాభార్జనతో అమ్మకాలకు దిగారని, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గడం, చైనా వెండి ఎగుమతుల సరళీకరణ ప్రకటనతో ధరలు భారీగా తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం సుమారు 75 శాతం, వెండి ఏకంగా 170 శాతం పైగా రాబడిని ఇచ్చాయి.
ప్రస్తుత తగ్గుదల మంచిదేనని, భవిష్యత్తులో ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలతో ధరల హెచ్చుతగ్గులు ఆధారపడుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న శుభకార్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం తగ్గిన ధరల వద్ద బంగారం, వెండి కొనుగోలు కొంతవరకు మంచిదేనంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram