Hajj 2025: భారత్‌కు.. ఉమ్రా వీసాల నిషేధం

సౌదీ అరేబియా ఉమ్రా (యాత్రల) వీసాల జారీపై నిషేధం విధించింది. భారత్‌తో సహా 14 దేశాలకు యాత్రా వీసాల జారీని సౌదీ అరేబియా నిలిపివేసింది. హజ్ యాత్ర సందర్భంగా అనూహ్యమైన రద్దీని నివారించేందుకు సౌదీ ఈ చర్య తీసుకుంది. యాత్రా వీసాల జారీపై నిషేధం ఏప్రిల్ 13 నుంచి జూన్ లో హజ్ యాత్ర ముగిసే వరకు ఉంటుంది. కుటుంబ సభ్యుల వీసాలు, బిజినెస్ వీసాలను కూడా హజ్ యాత్ర ముగిసేవరకు జారీ చేయబోమని సౌదీ వెల్లడించింది.
భారత్‌తోపాటు బంగ్లాదేశ్, పాకిస్థాన్, అల్జీరియా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేసియా, ఇరాక్, జోర్డాన్, మొరాకో, నైజీరియా, సూడాన్ వంటి దేశాలను ప్రస్తుతానికి నిషేధ జాబితాలో పెట్టింది. హజ్ యాత్ర సందర్భంగా అసాధారణ సంఖ్యలో భక్తులు రావడం, తరచూ తొక్కిసలాట జరగడం, అనేక మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిన విషయమే. రద్దీని తగ్గించడంకోసమే తాత్కాలిక నిషేధ ఆదేశాలు ఇచ్చినట్టు సౌదీ వివరించింది.