Heart Stroke | ఒకే రోజు 23 దంతాలు తొలగింపు.. గుండెపోటుతో బాధితుడి మృతి
Heart Stroke | ఓ వ్యక్తి తీవ్రమైన పంటి నొప్పి( Teeth Pain )తో బాధపడుతున్నాడు. దీంతో డెంటిస్ట్( Dentist )ను సంప్రదించి, ఒకే రోజు 23 దంతాలను( Teeth ) తొలగించుకున్నాడు. ఆ తర్వాత గుండెపోటు( Heart Stroke )తో మరణించాడు.

Heart Stroke | వయసు పైబడే కొద్ది చాలా మందిలో దంతాల సమస్య( Teeth Pain ) ఏర్పడుతుంది. ఈ సమస్య తీవ్రంగా ఉంటే.. శరీరంలోని ఇతర భాగాలపై ప్రభావం చూపుతుంది. అయితే ఓ వ్యక్తికి తీవ్రమైన పంటి సమస్య రావడంతో డెంటిస్ట్( Dentist ) దగ్గరకు వెళ్లాడు. ఒకే రోజు 23 దంతాలు( Teeth ) తొలగించి, కొత్తగా 12 దంతాలను అమర్చాడు. ఈ శస్త్ర చికిత్స జరిగిన 13 రోజులకు బాధిత రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన చైనా( China )లోని హిజియాంగ్ ప్రావిన్స్( Zhejiang Province )లో వెలుగు చూసింది.
చైనా( China )కు చెందిన హువాంగ్ అనే వ్యక్తికి తీవ్రమైన దంతాల సమస్య రావడంతో.. స్థానికంగా ఎంతో ఫేమస్ ఉన్న డీవే డెంటల్ క్లినిక్( DeWay Dental Clinic )కు ఈ ఏడాది ఆగస్టు 14ఇవ తేదీన వెళ్లాడు. రోగి అనుమతితో డాక్టర్లు( Doctors ) ఒకేసారి 23 దంతాలు తొలగించారు. అదే రోజు.. కొత్తగా 12 దంతాలను చేర్చారు. ఈ సర్జరీ విజయవంతం కావడంతో.. హువాంగ్‌ను ఇంటికి పంపించేశారు డాక్టర్లు.
ఇక హువాంగ్ కోలుకుంటున్నాడనే సమయానికి అంటే సర్జరీ జరిగిన 13 రోజులకు గుండెపోటు( Heart Stroke )తో ప్రాణాలు విడిచాడు. ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యం మీడియాతో మాట్లాడుతూ.. తమ దగ్గర సర్జరీ విజయవంతం అయిందని, హువాంగ్ మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే దవడల భాగంలో ఉండే దంతాలను తొలగించిన రోజే.. కొత్త దంతాలు ఇంప్లాంట్ చేయడం సరికాదన్నారు. ఎందుకంటే ఇది ఇతర సమస్యలకు దారి తీస్తుందని చెప్పారు. వయసు పైబడిన వారు సాధారణంగా 28 నుంచి 32 దంతాలను కలిగి ఉంటారు. అందులో 23 దంతాలను ఒకేసారి తొలగించడం సరికాదని పేర్కొన్నారు. అయితే రోగి హువాంగ్ అనుమతితోనే దంతాలను తొలగించామని స్పష్టం చేశారు.