HIV injection | అందుబాటులోకి హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌.. క్లినికల్ ట్రయల్స్‌లో సత్ఫలితాలు

HIV injection | హెచ్‌ఐవీ (HIV) నిర్మూలనకు సూది మందు అందుబాటులోకి వచ్చింది. హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్‌ నుంచి కాపాడే సూది మందు పరీక్షలు విజయవంతమయ్యాయి. దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన విస్తృత స్థాయి క్లినికల్‌ ట్రయల్స్‌ సత్ఫలితాలను ఇచ్చాయి. లెనకపవిర్‌ ఇంజెక్షన్‌ను ఆరు నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి రెండుసార్లు ఇవ్వడం వల్ల యువతను హెచ్‌ఐవీ నుంచి కాపాడవచ్చనని స్పష్టమైంది.

HIV injection | అందుబాటులోకి హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌.. క్లినికల్ ట్రయల్స్‌లో సత్ఫలితాలు

HIV injection : హెచ్‌ఐవీ (HIV) నిర్మూలనకు సూది మందు అందుబాటులోకి వచ్చింది. హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్‌ నుంచి కాపాడే సూది మందు పరీక్షలు విజయవంతమయ్యాయి. దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన విస్తృత స్థాయి క్లినికల్‌ ట్రయల్స్‌ సత్ఫలితాలను ఇచ్చాయి. లెనకపవిర్‌ ఇంజెక్షన్‌ను ఆరు నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి రెండుసార్లు ఇవ్వడం వల్ల యువతను హెచ్‌ఐవీ నుంచి కాపాడవచ్చనని స్పష్టమైంది.

రోజువారీ మాత్రల రూపంలో తీసుకునే రెండు ఇతర ఔషధాల కంటే ఈ లెనకపవిర్‌ ఇంజెక్షన్‌ మెరుగైనదా.. కాదా..? అనే అంశాన్ని ఈ పరీక్షల్లో విశ్లేషించారు. ఈ మూడు ఔషధాలు ప్రీ-ఎక్స్‌పోజర్‌ ప్రొఫిలాక్సిస్‌ (పీఆర్‌ఈపీ) డ్రగ్స్‌ అని పరిశోధకులు తెలిపారు. మొత్తం 2,134 మంది యువతులు లెనకపవిర్‌ ఇంజెక్షన్‌ను తీసుకోగా వారిలో ఎవరికీ హెచ్‌ఐవీ సోకలేదు. దాంతో నూటికి నూరు శాతం సత్ఫలితాలు వచ్చాయి.

అదేవిధంగా ట్రువడ (ఎఫ్‌/టీడీఎఫ్‌) ఔషధాన్ని 1,068 మంది యువతులు తీసుకోగా వారిలో 16 మందికి హెచ్‌ఐవీ వైరస్‌ సోకింది. కాబట్టి ఇతర ఔషధాల కంటే లెనకపవిర్‌ఇంజెక్షన్‌ హెచ్‌ఐవీ నిర్మూలనలో ఉత్తమమైనదిగా తేలింది. ఈ ఇంజెక్షన్‌ను అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు గిలీడ్‌ సైన్సెస్‌ ఓ ప్రకటనలో తెలిపింది.