అమెరికాలో భార‌త సంత‌తి.. కుటుంబం అనుమానాస్ప‌ద మృతి

అమెరికాలో భార‌త సంత‌తి.. కుటుంబం అనుమానాస్ప‌ద మృతి
  • ఆలుమ‌గ‌లు, ఇద్ద‌రు పిల్ల‌లు క‌న్నుమూత‌


విధాత‌: అమెరికా న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరో పట్టణంలోని త‌మ‌ నివాసంలో భారతీయ సంతతికి చెందిన దంపతులు, వారి ఇద్దరు పిల్లలు శవమై కనిపించిన‌ట్టు స్థానిక పోలీసులు వెల్ల‌డించారు. బుధవారం సాయంత్రం 4:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) వారి ఇంట్లో అనుమానాస్ప‌ద చ‌నిపోయిన‌ట్టు తెలిపారు.


మృతుల‌ను తేజ్ ప్రతాప్ సింగ్ (43), సోనాల్ పరిహార్ (42), వారి ఇద్ద‌రు కుమారులు 10 ఏండ్లు, 6 ఏండ్లు గా గుర్తించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. పోలీసులు అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ప‌ట్ట‌ణ మేయ‌ర్‌ పీటర్ కాంటూ మాట్లాడుతూ.. ఈ విషాద ఘటనతో తామంతా షాక్‌కు గుర‌య్యామ‌ని తెలిపారు. ఈ ప్రాంతంలో ఏం జరిగిందో అర్థం కావడం లేద‌ని పేర్కొన్నారు.