Mercedes-Benz Car | నివాళిగా.. మెర్సిడెస్ బెంజ్ కారుకు అంత్య‌క్రియ‌లు..!

Mercedes-Benz Car | ఒక మ‌నిషి చ‌నిపోతే అంత్య‌క్రియ‌లు చేయ‌డం స‌హ‌జం. అంత్య‌క్రియ‌ల అనంత‌రం మృత‌దేహాన్ని ఖ‌ననం చేస్తారు. కొంద‌రైతే ద‌హ‌నం చేస్తారు. ఆ త‌ర్వాత ద‌శ దిన‌క‌ర్మ నిర్వ‌హించి.. ఆ వ్య‌క్తికి ఇష్ట‌మైన ఆహార ప‌దార్థాల‌ను నివాళిగా స‌మ‌ర్పిస్తారు.

Mercedes-Benz Car | ఒక మ‌నిషి చ‌నిపోతే అంత్య‌క్రియ‌లు చేయ‌డం స‌హ‌జం. అంత్య‌క్రియ‌ల అనంత‌రం మృత‌దేహాన్ని ఖ‌ననం చేస్తారు. కొంద‌రైతే ద‌హ‌నం చేస్తారు. ఆ త‌ర్వాత ద‌శ దిన‌క‌ర్మ నిర్వ‌హించి.. ఆ వ్య‌క్తికి ఇష్ట‌మైన ఆహార ప‌దార్థాల‌ను నివాళిగా స‌మ‌ర్పిస్తారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో ర‌క‌మైన సంప్ర‌దాయం ఉంటుంది. కానీ చైనాలో మాత్రం చ‌నిపోయిన వ్య‌క్తికి నివాళిగా.. ఆయ‌న‌కు ఎంతో ఇష్ట‌మైన మెర్సిడెస్ బెంజ్ కారును భూమిలో పాతిపెట్టి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

ఈశాన్య చైనాలోని లియావోనింగ్ ప్రావిన్స్‌లోని లియావోయాంగ్ గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తి చ‌నిపోయాడు. ఇక అత‌న్ని పూడ్చిపెట్టారు. అయితే అత‌నికి విలాస‌వంత‌మైన కార్ల‌ను సేక‌రించ‌డం ఇష్టం. దీంతో తాను కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ కారును పూడ్చిపెడితే త‌మ తండ్రి ఆత్మ‌కు శాంతి చేకూరుతుంద‌ని భావించారు. అనుకున్న‌దే ఆల‌స్యం తండ్రి స‌మాధి ప‌క్క‌నే మెర్సిడెస్ బెంజ్ కారును కూడా పూడ్చిపెట్టి.. నివాళుల‌ర్పించారు.

ఈ మెర్సిడెస్ బెంజ్ కారుకు ఎర్ర‌టి వ‌స్త్రాన్ని క‌ప్పారు. సైడ్ మిర్ర‌ర్ల‌కు ఎరుపు రంగులో ఉన్న రిబ్బ‌న్ల‌ను క‌ట్టారు. అనంత‌రం గ్రామ‌స్తులు ఆ కారును స‌మాధిలోకి తోసేశారు. మ‌ట్టి క‌ప్పి నివాళుల‌ర్పించారు.

అయితే చైనాలో మ‌ర‌ణానంత‌రం వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని చెప్పి.. వారికి ఇష్ట‌మైన కార్లు, ఇల్లు, గృహోప‌క‌ర‌ణాల కాగిత‌పు న‌మూనాల‌ను ద‌హ‌నం చేస్తారు. కానీ ఈ కుటుంబం మాత్రం ఏకంగా త‌మ తండ్రికి ఇష్ట‌మైన మెర్సిడెస్ బెంజ్ కారును పూడ్చిపెట్టారు. ఈ అంశంపై ఇప్ప‌టి వ‌ర‌కు ఆ కుటుంబం ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.

Latest News