నేపాల్‌ వరదల్లో 320 మంది భారతీయులు గల్లంతు: విదేశాంగ శాఖ

నేపాల్‌ వరదల్లో మొత్తం 320 మంది భారతీయులు గల్లంతైనట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్‌ జయస్‌వాల్‌ వెల్లడించారు. 400 మంది భారతీయులు చైనాలో క్షేమంగా ఉన్నట్లు చెప్పారు.

విధాత : నేపాల్‌ వరదల్లో మొత్తం 320 మంది భారతీయులు గల్లంతైనట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్‌ జయస్‌వాల్‌ వెల్లడించారు. 400 మంది భారతీయులు చైనాలో క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. చైనా వైపు చిక్కుకుపోయిన 96 మంది భారతీయులు రోడ్డు మార్గంలో నేపాల్‌కు చేరుకున్నట్లు తెలిపారు. మరో 21 మంది ఢిల్లీకి క్షేమంగా వచ్చినట్లు వివరించారు.

538 మంది మృతదేహాల వెలికితీత..

నేపాల్‌ వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలలో భాగంగా ఇప్పటిదాకా 538 మృతదేహాలు వెలికితీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. త్రిశూలి 3ఏ హైడ్రోపవర్‌ ప్రాజెక్టు వద్ద సొరంగంలో చిక్కుకున్న వారిలో 350 మందిని నేపాల్‌ సైన్యం కాపాడింది. వీరిలో 63 మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

మరోవైపు టిబెట్ వైపున ఉన్న ఒక సరస్సు కట్టలు తెంచుకొని ప్రవహిస్తోందని నేపాల్ వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతోన్న బృందాలు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. నేపాల్ ప్రభుత్వం హెచ్చరికలతో ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు తరలిపోతున్నారు.

 

Latest News