నర్గీస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి పురస్కారం
స్టాక్‌హోం: ఇరాన్‌లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన నర్గీస్ మొహమ్మదీకి 2023 సంవత్సరానికిగాను నోబల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించారు. ఇరాన్‌లోని మతమౌఢ్యపు ఖోమేనీ ప్రభుత్వం అక్కడి మహిళలపై అనేక అణిచివేతలకు పూనుకొన్నది. ప్రభుత్వాన్నిఎదిరించి పోరాడిన మహిళలను క్రూరంగా హింసించింది. వీటన్నింటికీ వ్యతిరేకంగా నర్గీస్ మొహమ్మదీ పోరాటాలు చేశారు. హింసకు వ్యతిరేకంగా మహిళలను సంఘటితపర్చారు.
ఈ సందర్భంగా ఆమె అనేకసార్లు జైలుకు కూడా పోవలసి వచ్చింది. ఆ సమయంయలో ఇరాన్‌లో జరుగుతున్న మహిళా పోరాటాలు ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, మేధావులు, ప్రజాస్వామిక వాదుల మద్దతు ఇరాన్ మహిళలకు లభించింది. వీటన్నింటిలోనూ నర్గీస్ మొహమ్మదీ కృషి ఎంతో ఉండి. ఆమె చేసిన ఈ సేవలకుగాను ఆమెకు నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేశారు. ఆమె పోరాటాలు ఇరాన్‌లో మానవ హక్కుల పునరుద్ధరణకు దోహదపడ్డాయి. నోబెల్ బహుమతి కింద నర్గీస్ మొహమ్మదీకి 11.0 మిలియన్ స్వీడిష్ క్రోనర్లు(రూ.8.1 కోట్లు) ఇస్తారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram