Hyderabad Student | అమెరికాలో దారుణం.. పిజ్జా డెలివరీకి వెళ్తుండగా తెలుగు యువకుడి దారుణ హత్య

Hyderabad Student | అమెరికాలో దారుణం జరిగింది. నార్త్ ఫిలడెల్పియాలో దుండుగులు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు దుర్మరణం చెందాడు.

Reported by: Chandram | ప్రవాస | Jun 06, 2026, 10:07 pm IST
Read Time: 3 mins
Hyderabad Student | అమెరికాలో దారుణం.. పిజ్జా డెలివరీకి వెళ్తుండగా తెలుగు యువకుడి దారుణ హత్య

Hyderabad Student | అమెరికాలో దారుణం జరిగింది. నార్త్ ఫిలడెల్పియాలో దుండుగులు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు దుర్మరణం చెందాడు.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని గుండ్లపోచంపల్లికి చెందిన కుంచ అంశుల్ కొంతకాలం కింద అమెరికా వెళ్లాడు. అక్కడే పార్ట్‌టైమ్‌గా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి పిజ్జా డెలివరీ కోసం వెళ్తున్న సమయంలో కొందరు దుండగులు అంశుల్‌పై కాల్పులు జరిపారు. దీంతో అంశుల్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

గుండ్లపోచంపల్లిలోని ఎప్సీలోన్ వెంచర్‌ ప్రాంతంలో అంశుల్ కుటుంబసభ్యులు నివసిస్తున్నారు. అమెరికాలో అంశుల్ మరణవార్త తెలియగానే అతని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వదేశానికి త్వరగా తీసుకొచ్చేలా ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కాగా, సోమవారం నాటికి అంశుల్ మృతదేహం సోమవారం నాటికి భారత్‌కు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కాగా, అంశుల్ హత్యకు గల కారణాలపై అమెరికాలోని న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది దోపిడీ ప్రయత్నమా? లేక ఇతర కారణాల వల్ల జరిగిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.