Panj Tirath | మహాభారత కాలం నాటి ఆలయాన్ని అపవిత్రం చేసిన పాక్‌..!

Panj Tirath | పొరుగుదేశం పాకిస్థాన్‌లో హిందూ ఆలయాలుపై దాడులు, పవిత్రమైన పుణ్యక్షేత్రాలను అపవిత్రం చేయడం కొనసాగుతున్నది. ఇప్పటికే ఆలయాలను ధ్వంసం చేయగా.. తాజాగా మహాభారతకాలానికి చెందిన పంజ్‌ తీరథ్‌ (పంచతీర్థం)ను పాక్‌ అపవిత్రం చేసింది. ఖైబర్‌ ఫంఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ రాజధాని పెషావర్‌లోని పంజ్‌ తీరథ్‌ ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా ఉండగా.. దాన్ని గిడ్డంగా మార్చింది. ఈ విషయాన్ని బిట్టర్ వింటర్ మ్యాగజైన్‌ తెలిపింది. పంజ్‌ తీరథ్‌ యాత్ర పాండురాజు, పంచ పాండవులతో ముడిపడి ఉన్న హిందూ […]

Panj Tirath | మహాభారత కాలం నాటి ఆలయాన్ని అపవిత్రం చేసిన పాక్‌..!

Panj Tirath | పొరుగుదేశం పాకిస్థాన్‌లో హిందూ ఆలయాలుపై దాడులు, పవిత్రమైన పుణ్యక్షేత్రాలను అపవిత్రం చేయడం కొనసాగుతున్నది. ఇప్పటికే ఆలయాలను ధ్వంసం చేయగా.. తాజాగా మహాభారతకాలానికి చెందిన పంజ్‌ తీరథ్‌ (పంచతీర్థం)ను పాక్‌ అపవిత్రం చేసింది. ఖైబర్‌ ఫంఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ రాజధాని పెషావర్‌లోని పంజ్‌ తీరథ్‌ ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా ఉండగా.. దాన్ని గిడ్డంగా మార్చింది. ఈ విషయాన్ని బిట్టర్ వింటర్ మ్యాగజైన్‌ తెలిపింది. పంజ్‌ తీరథ్‌ యాత్ర పాండురాజు, పంచ పాండవులతో ముడిపడి ఉన్న హిందూ ఆలయం. దాదాపు వెయ్యి సంవత్సరాలు ఓ వెలుగు వెలుగిన ఆలయం.. దేశ విభజన తర్వాత నిరాధరణకు గురైంది. ప్రస్తుతం రెండు శిథిల ఆలయాలు మిగలగా.. ఈ ప్రాంతాన్ని స్థానిక ప్రభుత్వం చాకా యూనస్‌ ఫ్యామిలీ పార్క్‌ నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు కంపెనీకి లీజుకు ఇచ్చింది.

ఆలయానికి ఎంతో విశిష్టత

పంచతీర్థ పేరుతో పిలిచే ఈ పుణ్యక్షేత్రానికి ఎంతో విశిష్టత, ప్రాముఖ్యత ఉన్నది. మహాభారత కాలంలో పాండురాజు ఇక్కడి కొలనులో స్నానం చేసినట్లు పురాణ కథలున్నాయి. కార్తీక మాసంలో హిందువులు ఇక్కడి కొలనుల్లో స్నానాలు చేసి.. రెండు రోజుట పాటు ఆలయంలో ఉన్న చెట్ల కింద ప్రత్యేక పూజలు చేసేవారు. ఆలయం విషయంలో కోర్టులో ఉండగా.. కేసు తేలక ముందే పంచతీర్థను జాతీయ సంపదగా ప్రకటించిన స్థానిక ప్రభుత్వం.. యాత్రికుల సందర్శనార్థం తెరుస్తామని ప్రకటించింది. దేవాలయాలను గిడ్డంగా వినియోగిస్తున్న అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ యజమాని సైట్‌ను తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి చెప్పారు. అయితే, పురావస్తు శాస్త్రవేత్తలు స్వాధీనం చేసుకొనేందుకు వెళ్లగా సాయుధ వ్యక్తులు బెదిరింపులకు గురి చేశారు. ఇచ్చిన హామీ మేరకు భూమి ఇవ్వలేదు. ఈ విషయంపై కోర్టుకెక్కినా సమస్య పరిష్కారం కావడం లేదు. హిందూ చారిత్రక ఆలయాలు, ప్రదేశాలు పాక్‌లో ఆక్రమణలో ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా ఆలయాల్లో పూజలు చేసేందుకు అనుమతి లేదు. ఈ అంశంపై ఇంకా కోర్టులో విచారణ కొనసాగుతోంది.