పైలట్ మెరుపు నిర్ణయం…వందలాది విమాన ప్రయాణికులు సురక్షితం!

ఓ విమాన పైలట్ సకాలంలో వేగంగా తీసుకున్న నిర్ణయం ఆ విమానంలోని వందలాది మంది ప్రాణాలను కాపాడిన ఘటన వీడియో వైరల్ గా మారింది. వెల్లింగ్టన్‌లో ఎయిర్ న్యూజిలాండ్ ఫ్లైట్ NZ272 ల్యాండింగ్ సమయంలో భారీ ప్రమాదాన్ని తప్పించుకుంది.

ఓ విమాన పైలట్ సకాలంలో వేగంగా తీసుకున్న నిర్ణయం ఆ విమానంలోని వందలాది మంది ప్రాణాలను కాపాడిన ఘటన వీడియో వైరల్ గా మారింది. వెల్లింగ్టన్‌లో ఎయిర్ న్యూజిలాండ్ ఫ్లైట్ NZ272 ల్యాండింగ్ సమయంలో భారీ ప్రమాదాన్ని తప్పించుకుంది. విమానం రన్‌వేను తాకే సమయంలో తీవ్రమైన విండ్ షియర్ (గాలి ఉధృతి), భారీ వర్షం కారణంగా వాతావరణం అకస్మాత్తుగా ప్రమాదకరంగా మారింది. దీంతో విమానం ల్యాండింగ్ కు ముందే గాలిలో అదుపుతప్పడం మొదలైంది. విమాన చక్రాలు రన్‌వేకు తాకుతున్నప్పుడు విమానం కుదుపులకు లోనవ్వడంతో ల్యాండింగ్‌ చేయడం ప్రమాదరకం అని భావించిన పైలట్.. కేవలం 2 సెకన్లలో అప్రమత్తమై, ల్యాండింగ్‌ ను నిలిపివేసి విమానాన్ని తిరిగి ఆకాశంలోకి తీసుకెళ్లారు.

దీంతో విమానం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. పైలట్ తీసుకున్న నిర్ణయంతో విమానానికి పెను ప్రమాదం తప్పిపోగా…అందులోని వందలాది మంది ప్రయాణికులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడినట్లయ్యింది. విమానాన్ని సురక్షితంగా క్రైస్ట్‌చర్చ్‌కు మళ్లించారు. ఈ ఘటనలో ఎటువంటి గాయాలు నమోదు కాలేదు. పైలట్ నిర్ణయం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వెల్లింగ్టన్ కొండ ప్రాంతం, ఓడరేవు సమీపంలో ఉండటంతో ఇక్కడ తరచుగా గాలుల తీవ్రత ప్రమాదాలను సృష్టిస్తున్నాయి. అందుకే విమానయానంలో అనుభవజ్ఞులైన పైలట్ల తక్షణ నిర్ణయాలు ఎంత కీలకమో ఈ ఘటన స్పష్టం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

Latest News