UK Election | బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో రిషీ సునాక్‌కు ఘోరం పరాజయం ఎదురుకాబోతున్నదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంచేశాయి. ఈ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకోబోతున్నదని, లేబర్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం లేబర్ పార్టీ అభ్యర్థి కైర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధాని కాబోతున్నారు.
UK Election : బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో రిషీ సునాక్‌కు ఘోరం పరాజయం ఎదురుకాబోతున్నదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంచేశాయి. ఈ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకోబోతున్నదని, లేబర్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం లేబర్ పార్టీ అభ్యర్థి కైర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధాని కాబోతున్నారు.
బ్రిటన్ పార్లమెంట్‌లోని మొత్తం 650 సీట్లకుగాను ప్రతిపక్ష లేబర్ పార్టీ 410 సీట్లు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. 14 సంవత్సరాల కన్జర్వేటివ్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఈ ఎన్నికలు ముగింపు పలుకనున్నాయని వెల్లడించాయి. సునక్ కన్జర్వేటివ్ పార్టీకి కేవలం 131 సీట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి.
బ్రిటన్‌లో జరిగిన గత ఆరు జాతీయ ఎన్నికల్లో 2015లో వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రమే తప్పయ్యాయి. అప్పుడు హంగ్ పార్లమెంట్ వస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేశాయి. కానీ అప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు విరుద్ధంగా కన్జర్వేటివ్ పార్టీ మెజారిటీ సాధించింది. కాగా, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ మే నెలలో ముందస్తు ఎన్నికల ప్రకటన చేశారు.
అయితే, రిషి సునక్ ప్రకటన అతని స్వంత పార్టీలో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎన్నికలు పార్లమెంట్లో సీట్ల అంతరాన్ని మరింత పెంచుతాయని సునక్ ఆశించారు. కానీ అది వ్యతిరేక ప్రభావాన్ని చూపింది. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి అందరి దృష్టి కన్జర్వేటివ్ పార్టీతోపాటు లేబర్ పార్టీ అభ్యర్థి, ప్రతిపక్ష నేత కైర్ స్టార్మర్‌పై కూడా పడింది.
రిషి సునక్ ఎన్నికల తేదీ ప్రకటించకముందే కన్జర్వేటివ్ అభ్యర్థులు గ్యాంబ్లింగ్ స్కామ్‌లో చిక్కుకున్నారు. ఇంతలో ఒక టీవీ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఫ్రాన్స్‌లో D-Day స్మారక కార్యక్రమాల నుంచి సునక్ ముందుగానే బయలుదేరడం అనుభవజ్ఞులకు కోపం తెప్పించింది. సునక్ పార్టీకి చెందిన వ్యక్తులు కూడా సునక్ చర్యను వ్యతిరేకించారు. ఇది అతని రాజకీయ నైపుణ్యాలపై ప్రశ్నలను లేవనెత్తింది.