Surgery During Earthquake In Russia | భూకంపంలోనూ పేషంట్ కు ఆపరేషన్

భారీ భూకంపం కొనసాగుతుండగా రష్యా వైద్యులు ఓ పేషెంట్‌కు సర్జరీని కొనసాగించిన వీడియో వైరల్ అయింది. ప్రాణాలకు తెగించి కర్తవ్యాన్ని నిర్వర్తించిన వైద్య బృందంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Surgery During Earthquake In Russia | భూకంపంలోనూ పేషంట్ కు ఆపరేషన్

Surgery During Earthquake In Russia | విధాత : రష్యాలో ఓ వైపు భారీ భూకంపం..ఇంకోవైపు సునామీతో ప్రజలంతా భయాందోళనలతో ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నాల్లో ఉండగా..ఓ ఆసుపత్రి వైద్య బృందం మాత్రం ఓ రోగి ప్రాణాలు కాపాడేందుకు ఆపరేషన్ లో నిమగ్నమైన వీడియో వైరల్ గా మారింది. రష్యాలోని కామ్చాట్కాలో భారీ భూకంపం సమయంలో ఓ ఆసుపత్రిలో వైద్యులు సర్జరీ చేస్తున్నారు. భూకంప తీవ్రతకు ఆసుపత్రి భవనం ఊగిపోతుండగా…భయంతో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు సర్జరీని మధ్యలోనే వదిలేసి స్వార్థంతో పారిపోలేదు.

ఆపరేషన్ స్ట్రెచ్చర్ పైన ఉన్నపేషెంట్ కింద పడకుండా వైద్య సిబ్బంది గట్టిగా పట్టుకోగా..వైద్యులు సర్జరీ కొనసాగించి పూర్తి చేశారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. వైద్య బృందం వృత్తి నిబద్దతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆ సర్జరీ విజయవంతంగా జరిగిందని.. రోగి కోలుకుంటున్నారని రష్యన్‌ ఆరోగ్య శాఖ ప్రకటించడం విశేషం.