Saudi Arabia’s Sky Stadium : ఆకాశ స్టేడియం.. సౌదీ అరేబియా ఇంజినీరింగ్ మార్వెల్!

ప్రపంచంలోనే మొట్టమొదటి 'స్కై స్టేడియం' నిర్మాణానికి సౌదీ అరేబియా శ్రీకారం చుట్టింది. భూమికి 350 మీటర్ల ఎత్తులో నిర్మించే ఈ నియోమ్ స్టేడియం 2032 నాటికి పూర్తి కానుంది. 2034 FIFA వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లకు ఈ అద్భుతం ఆతిథ్యం ఇవ్వనుంది.

Saudi Arabia’s Sky Stadium : ఆకాశ స్టేడియం.. సౌదీ అరేబియా ఇంజినీరింగ్ మార్వెల్!

న్యూఢిల్లీ: ఆకాశ హర్మ్యాల నిర్మాణాలలో సౌదీ అరేబియా ఇంజనీరింగ్ నైపుణ్యం చైనా, జపాన్ వంటి దేశాలకు ధీటుగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా నేలపై నిర్మించాల్సిన స్పోర్ట్స్ స్టేడియాలను ఆకాశంలో నిర్మించే అద్బుతానికి సౌదీ అరేబియా పూనుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి స్కై స్టేడియం నిర్మాణానికి సౌదీ అరేబియా సిద్దమైంది. తన భవిష్యత్తు నగరం ‘ది లైన్‌’లో నియోమ్ మెగాసిటీ ప్రాజెక్టులో భాగంగా నియోమ్ స్టేడియం నిర్మాణానికి సన్నాహాలు చేపట్టంది. 2032 నాటికి.. ఈ స్కై స్టేడియం ప్రారంభం కానుందని సౌదీ అరేబియా ప్రకటించింది. భూమికి దాదాపు 350 మీటర్ల ఎత్తులో.. ఈ నియోమ్ స్టేడియం నిర్మిస్తుంది. 2034 ఫీఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు ఈ అద్బుత స్కై స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుందని వెల్లడించింది.

ఆకాశంలో అద్భుతంగా..సౌదీ అరేబియా ఇంజినీరింగ్ మార్వెల్ గా ఈ స్కై స్టేడియం నిర్మాణం కానుందని నిపుణులు చెబుతున్నారు. ఈ స్టేడియం నిర్మాణాన్ని 2027లో ప్రారంభించి 2032 నాటికి పూర్తి చేయనుంది. ఎడారి దేశంలో భూమికి దాదాపు 350 మీటర్ల ఎత్తులో నిర్మించననున్న స్కై స్టేడియంలో 46,000 మంది కూర్చునేలా నిర్మిస్తున్నారు. స్కై స్టేడియం నిర్మాణం జరిగితే చరిత్రలో అత్యంత అద్భుతమైన క్రీడా వేదికలలో ఒకటిగా మారనుంది. ప్రపంచ వేదికపై సౌదీ అరేబియా రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధికి మైలురాయిగా నిలవనుంది. 2034 ఫిఫా ప్రపంచ కప్‌ నిర్వహణకు బిడ్‌ సమర్పించిన ఏకైక దేశం సౌదీ అరేబియా. ఈ ప్రపంచ కప్ ఈవెంట్‌లో స్కై స్టేడియం స్పెషల్‌ కానుందని భావిస్తున్నారు.