ఆ స్ప్రే చల్లితే అంతా ఐకమత్యమే

ఫేస్‌బుక్‌లో చూసిన ఓ స్ప్రే చల్లితే చాలు..పరస్పరం కొట్లాడుకునే జీవాలు కలిసిమెలసి ఐక్యతారాగం పాడుతున్నాయి. ఆ వింత స్ప్రే ప్రయోగం బ్రిటన్‌లో గొర్రెలపై సత్ఫలితాలను ఇస్తుండటం ఆసక్తికరంగా మారింది.

ఆ స్ప్రే చల్లితే అంతా ఐకమత్యమే

బ్రిటన్‌లో గొర్రెలపై వింత స్ప్రే ప్రయోగం

విధాత, హైదరాబాద్ : ఫేస్‌బుక్‌లో చూసిన ఓ స్ప్రే చల్లితే చాలు..పరస్పరం కొట్లాడుకునే జీవాలు కలిసిమెలసి ఐక్యతారాగం పాడుతున్నాయి. ఆ వింత స్ప్రే ప్రయోగం బ్రిటన్‌లో గొర్రెలపై సత్ఫలితాలను ఇస్తుండటం ఆసక్తికరంగా మారింది. బ్రిటన్‌లో గొర్రెల పెంపకందారులకు మందలో గొర్రెలు పరస్పరం కొట్లాడుకుని గాయాల పాలవ్వడం ద్వారా నష్టాలు ఎదురవుతున్నాయి.‘యాక్స్‌’ బాడీ స్ప్రేను గొర్రెలకు స్ప్రే చేస్తే కొట్లాడుకోవడం ఆపేస్తాయని ‘లేడీస్‌ హూ లాంబ్‌’ అనే ఫేస్‌బుక్‌ గ్రూప్‌లో శామ్‌ బ్రైస్‌ అనే గొర్రెల పెంపకందారు ఓ సలహా చూశారు. ఈ సమస్యకు పరిష్కారంంగా డియోడరెంట్ అనే స్ప్రే ప్రయోగం చేసి సత్ఫలితాలు అందుకున్నారు. గొర్రెలకు డియోడరంట్‌ స్ప్రే చేయగానే ఆ సువాసనకు గొర్రెలు కొట్లాడుకోవడం మానేసి కలిసి మెలిసి ఉంటున్నాయని పెంపకందారులు సంబరపడుతున్నారు. ఇప్పుడు వింత స్ప్రేకు గొర్రెల పెంపకందారుల్లో భలే డిమాండ్ పెరిగిపోయింది.