Shubhanshu Shukla | అంతరిక్షంలో శుభాంశు శుక్లా హెయిర్‌కట్.. వైరల్
Shubhanshu Shukla | న్యూఢిల్లీ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) హెయిర్ కట్ వీడియో వైరల్ గా మారింది. స్పేస్ లో శుభాంశు శుక్లాకు యూఎస్ వ్యోమగామి నికోల్ అయర్స్(US astronaut Nichole Ayers)హెయిర్ కట్ చేశారు. భూమిపైకి తిరిగి వచ్చిన తర్వాత తన హెయిర్ కట్ బిజినెస్ బాగా నడుస్తుందా అని వ్యోమగాములతో నికోల్ ఈ సందర్భంగా జోక్ చేశారు. శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) ఈ రోజు మంగళవారం మధ్యాహ్నం భూమికి చేరుకోనున్నారు. ఆయన ప్రయాణిస్తున్న స్పేస్ ఎక్స్ డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌక 22గంటల పాటు ప్రయాణించి అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ మహాసముద్ర జలాల్లో దిగనుంది.. 7రోజుల క్వారంటైన్ తర్వాతా ఆయన భారత్ కు చేరుకుంటారు. 18రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న శుక్లా 60అంశాలపై ప్రయోగాలు చేశారు.
నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన యాగ్జియం–4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి, వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో పాటు పెగ్గీ వాట్సన్ (అమెరికా), స్లావోజ్ ఉజ్నాన్‌స్కీ విస్నియెవ్‌స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) జూన్ 25న ఐఎస్‌ఎస్‌కు బయల్దేరడం తెలిసిందే. 28 గంటల ప్రయాణం అనంతరం వారు 26న విజయవంతంగా ఐఎస్‌ఎస్‌లోకి ప్రవేశించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram