స్కూల్‌లో రేస్‌.. గుండెపోటుతో టీనేజ‌ర్ మృతి

  • Publish Date - November 8, 2023 / 07:31 AM IST

  • అమెరికాలోని ఫ్లోరిడాలో ఘ‌ట‌న‌

విధాత‌: ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొవిడ్ త‌ర్వాత ఆక‌స్మిక‌ గుండెపోటు మ‌ర‌ణాలు పెరిగిపోతున్నాయి. పిల్ల‌లు, పెద్ద‌లు, ఊబ‌కాయులు, స‌న్న‌గా ఉన్న‌వారు, యువ‌త, వ్యాయమం చేసేవారు, వృద్ధులు ఇలా అన్నిర‌కాలవారు ఆకస్మిక హార్ట్ ఎటాక్‌తో చ‌నిపోతున్నారు. తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ స్కూల్ విద్యార్థి గుండెపోటుతో మ‌ర‌ణించాడు.


ఫ్లోరిడాకు చెందిన పద్నాలుగేళ్ల చిన్నారి ఎవర్‌గ్లేడ్స్ ఉన్నత పాఠశాలలో చ‌దువుతున్నాడు. ఇటీవ‌ల డేవిస్ వెస్ట్రన్ హై స్కూల్‌లో నిర్వ‌హించిన జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్ ప్రాక్టీస్‌లో భాగంగా ఐదు కిలోమీటర్ల రేసులో పాల్గొని ఒక్క‌సారిగా కుప్ప‌కూలి పోయాడు. హుటాహుటిన అత‌డిని స్కూల్ సిబ్బంది ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అయినా, వైద్యులు బాలుడి ప్రాణాలు కాపాడ‌లేక‌పోయారు.

Latest News