తమ జనాభాకు కోవిద్ వాక్సిన్ వేయడంలో అగ్ర స్థానంలో ఉన్న దేశాలు ఇవిగో . తమ జనాభాలో మొత్తం ఎంత శాతానికి వాక్సిన్ వేశాయో కూడా చూద్దాము .
1 . ఇజ్రాయెల్- 62 % . 2. మంగోలియా - 55 . 3 . యూకే - 55 . 4 . హుంగైరి- 51 . 5 . బహరేన్ - 51 . 6 . చిలి - 50 . 7 . కెనడా - 49 . 8 . అమెరికా - 48 . 9 . జర్మనీ - 39 % . 10 . […]

1 . ఇజ్రాయెల్- 62 % . 2. మంగోలియా – 55 . 3 . యూకే – 55 . 4 . హుంగైరి- 51 . 5 . బహరేన్ – 51 . 6 . చిలి – 50 . 7 . కెనడా – 49 . 8 . అమెరికా – 48 . 9 . జర్మనీ – 39 % . 10 . ఇటలీ – 34 . మన దేశం లో ఇప్పటిదాకా పది శాతం జనాభాకు వాక్సిన్ వేశారు . పైన పేర్కొన్న దేశాల్లో డిసెంబర్ నుంచి ఇప్పటి దాకా వివిధ సమయాల్లో వాక్సిన్ ప్రక్రియ ప్రారంభించారు . ఉదాహరణకు అందరికంటే ముందుగా ఇజ్రాయెల్ లో డిసెంబర్ రెండవ వారం తో మొదలు పెట్టి ఫిబ్రవరి రెండవ వారం లోగా వాక్సిన్ ప్రక్రియ జరిగింది . అదే మంగోలియా లో అయితే మార్చ్ చివరి వారం తో మొదలు పెట్టి ఇప్పటిదాకా వాక్సిన్ ప్రక్రియ సాగుతోంది .
పైన పేర్కొన్న దేశాల్లో అమెరికా ఇంగ్లాండ్ మినహాయించి మిగతా అన్ని దేశాల్లో ఒక ట్రెండ్ స్పస్టముగా కనిపిస్తోంది . ఎప్పుడైతే వాక్సిన్ ప్రక్రియ మొదలైందో అప్పుడే రెండో వేవ్ కూడా మొదలైంది . రెండో వేవ్ లో కేసులు మరణాలు మొదటి వేవ్ కంటే రెట్టింపుగా వున్నాయి . మొదటి వేవ్ తరువాత ఆరు నెలలకు రెండో వేవ్ వచ్చింది అనుకోవడానికి కూడా లేదు . ఉదాహరణకు మంగోలియా లో మొదటి వేవ్ పెద్దగా లేదు . అక్కడ కరోనా కేసులు పెరగడం , మరణాలు జరగడం సరిగ్గా వాక్సిన్ వేయడం తో ప్రారంభం అయ్యింది . కెనడా లో వాక్సిన్ తో బాటు మూడో వేవ్ వచ్చింది . రెండో వేవ్ కు మూడో వేవ్ కు మధ్య ఒక నెల మాత్రమే వ్యవధి వుంది . మూడో వేవ్ లో కేసులు రెండో వేవ్ లాగే మొదటి వేవ్ తో పోల్చితే రెట్టింపు వున్నాయి .
ఒక్క అమెరికా ఇంగ్లాండ్ దేశాల్లో మాత్రమే వాక్సిన్ ప్రక్రియ మొదలు పెట్టడం తో కేసులు మరణాలు తగ్గాయి . మిగతా ఎనిమిది దేశాల్లో వాక్సిన్ తో బాటే రెండో వేవ్ { కొన్నింటి లో మూడో వేవ్ వచ్చింది } . ఇండియా లో కూడా ఇలా జరగడం గమనార్హం . కొన్ని దేశాల్లో రెండో వేవ్ ఉదృతి ఇంకా కొనసాగుతోంది . ఉదాహరణ చిలి , బహరేన్ . కొన్నింటిలో ఇది తగ్గుముఖం పట్టింది – ఉదాహరణ . ఇజ్రాయిల్ .
వాక్సిన్ వేయడం లో ముందున్న టాప్ టెన్ దేశాల్లో ఎనిమిదింటిలో వాక్సిన్ వేయడం ప్రారంభించినప్పుడే రెండో వేవ్ మొదలు కావడం , అది కూడా మొదటి వేవ్ తో పోలిస్తే రెట్టింపు స్థాయిలో ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు . వాక్సిన్ వేసుకొనుంటే పాజిటివ్ వస్తుంది అనే అర్థం లో నేను ఈ పోస్ట్ పెట్టడం లేదు . దయ చేసి అర్థం చేసుకోగలరు . మరి ఎందుకు ఇలా జరుగుతోంది ? దీన్నే విశ్లేషించాలి . మంగోలియా లో అయితే మరింత చిత్రం . అసలు మొన్నటి దాకా వారి దేశం లో పెద్దగా కరోనా కేసులు లేవు . ఎప్పుడైతే వాక్సిన్ మొదలు పెట్టారో అప్పుడే కేసులు మరణాలు జరిగాయి . వాక్సిన్ ప్రక్రియ లో పదకొండో స్థానం లో ఉన్న ఫ్రాన్స్ విషయం లో ఎక్కడో అడుగున ఉన్న బ్రెజిల్ ఇంకా మన దేశం లో కూడా ఇలాగె జరిగింది . అంటే మొత్తం పదమూడు దేశాల్లో పదకొండు దేశాలు . అది కూడా సరిగ్గా వాక్సిన్ ప్రక్రియ మొదలైనప్పుడే రెండో వేవ్ .. అదీ ఉదృతంగా .. దీని భావమేమి తిరుమలేశా ?
ఇంకో సారి చెబుతున్నా . వాక్సిన్ వేసుకోవడం వల్ల పాజిటివ్ వచ్చి కేసులు పెరిగాయి అని నేను అనుకోవడం లేదు . ఇలా ఎందుకు జరుగుతుందో వివరించాల్సిన బాధ్యత వాక్సిన్ తయారు చేస్తున్న ఫార్మా కంపెనీ లు, ఆయా దేశాల మెడికల్ ఎక్స్పర్ట్స్ పై వుంది .
వాక్సిన్ వేసుకొంటే రెండేళ్లలో మరణం ఖాయం అనే వార్త వాట్సాప్ ల లో వైరల్ అవుతోంది . దీన్ని నేను నమ్మడం లేదు . ఇది కేవలం ఫేక్ అని తోసిపుచ్చడం కన్నా అందులో పేర్కొన్న వ్యక్తి చెప్పిన అంశాలు ఏ విధంగా సరైనది కాదో వివరించాల్సిన భాద్యత ఫార్మా కంపెనీ ల పై వుంది . లేదా కనీసం ప్రభుత్వ అధికారులు ముందుకు వచ్చి చెప్పాలి . సింపుల్ గా ఫేక్ అని ఊరుకొంటే జనాల్లో భయం తొలగదు . వాక్సిన్ విషయం లో పారదర్శకత ఉండాలి . లేకుంటే భయపెట్టే వార్తలు రాజ్యం ఏలుతాయి . మన దేశం లో లక్షల మంది వాక్సిన్ వేసుకోవడం మొదలు పెట్టినప్పుడే ఇలాంటి వార్త వైరల్ కావడం అంటే ఇది జనాల్ని ఎంత భయపెడుతుందో అర్థం చేసుకోవచ్చు . ఇందులో ఇచ్చిన లాజిక్ గురించి మెడికల్ ఎక్స్పర్ట్స్ మాట్లాడాలి . అధికారికంగా మాట్లాడాలి . నేనైతే ఈ లాజిక్ సరైనది కాదని నమ్ముతున్నా. అదే సమయం లో సరిగ్గా వాక్సిన్ ప్రక్రియ మొదలు పెట్టినప్పుడే కేసులు పెరగడం ఎందుకో నాకు అంతు చిక్కడం లేదు .