Fish | అరుదైన దృశ్యం.. మూడు కన్నుల చేప..
Fish | చేపలు.. చెరువుల్లో, నదుల్లో, సముద్రాల్లో విరివిగా లభిస్తుంటాయి. కొందరు ప్రత్యేకంగా చేపలను పెంచుతుంటారు. ఎందుకంటే చేపలకు అంత డిమాండ్ ఉంటుంది కాబట్టి. ఈ చేపల్లో రకరకాల చేపలు ఉంటాయి. చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి.

Fish | చేపలు.. చెరువుల్లో, నదుల్లో, సముద్రాల్లో విరివిగా లభిస్తుంటాయి. కొందరు ప్రత్యేకంగా చేపలను పెంచుతుంటారు. ఎందుకంటే చేపలకు అంత డిమాండ్ ఉంటుంది కాబట్టి. ఈ చేపల్లో రకరకాల చేపలు ఉంటాయి. చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ చేపలను ఇష్టంగా తినేవారు చాలా మందే ఉంటాయి. చేపలను తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, అనారోగ్య సమస్యలను దూరంగా పెట్టొచ్చు.
అయితే గ్రీన్‌ల్యాండ్‌లో ఓ జాలరికి అరుదైన చేప లభించింది. చేపలకు సాధారణంగా ఎడమ, కుడి వైపుల రెండు కళ్లు ఉంటాయి. కానీ ఈ చేపకు మాత్రం మూడు కళ్లు ఉన్నాయి. సాధారణ చేపలకు ఉన్నట్టే ఎడమ, కుడి వైపున రెండు కళ్లు ఉన్నాయి. దాని తలపై మరో కన్ను ఉంది. దీంతో మూడు కళ్లు ఉన్న చేప సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది.
ఈ మూడు కళ్ల చేప సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూడు కన్నుల్లో ఒక కన్ను కనిపించకుండా ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిని ఎక్సోఫ్తాల్మియా అని అంటారని చెబుతున్నారు. మొత్తానికి మూడు కన్నుల చేప సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.