ట్రూత్‌ సోషల్‌ పేరుతో ట్రంప్ కొత్త సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్

విధాత‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం చోటు చేసుకున్న క్యాపిటల్‌ హిల్‌ హింసాత్మక ఘటనల కారణంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై సోషల్‌ మీడియా నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా దిగ్గజాలు Facebook, Twitter, YouTube లలో ట్రంప్‌ సోషల్‌ ఖాతాలను బ్యాన్‌ చేశాయి. ఈ నేపథ్యంలో తానే స్వయంగా ఓ సోషల్‌ మీడియా నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించారు. ట్రూత్‌ సోషల్‌ పేరుతో ఈ ప్లాట్‌ఫామ్‌ని తీసుకురానున్నట్లు తెలిపారు. ట్రంప్‌ మీడియా […]

ట్రూత్‌ సోషల్‌ పేరుతో ట్రంప్ కొత్త సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్

విధాత‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం చోటు చేసుకున్న క్యాపిటల్‌ హిల్‌ హింసాత్మక ఘటనల కారణంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై సోషల్‌ మీడియా నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా దిగ్గజాలు Facebook, Twitter, YouTube లలో ట్రంప్‌ సోషల్‌ ఖాతాలను బ్యాన్‌ చేశాయి.

ఈ నేపథ్యంలో తానే స్వయంగా ఓ సోషల్‌ మీడియా నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించారు. ట్రూత్‌ సోషల్‌ పేరుతో ఈ ప్లాట్‌ఫామ్‌ని తీసుకురానున్నట్లు తెలిపారు. ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌(టీఎంటీజీ) ఈ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.