ఇరాన్‌పై ప్రతి దాడికి దిగితే..ఇజ్రాయెల్‌కు మద్దతునివ్వం: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పష్టీకరణ
పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ వివాదంపై మరోసారి స్పందించారు. ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులను ఇజ్రాయెల్ విజయవంతంగా
విధాత : పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ వివాదంపై మరోసారి స్పందించారు. ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులను ఇజ్రాయెల్ విజయవంతంగా తిప్పికొట్టిన ఇజ్రాయెల్ ఎక్కడ ప్రతిదాడికి పాల్పడుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో బైడెన్ ప్రకటన ఆసక్తికరంగా మారింది. తాజా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడిన బైడెన్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఇరాన్ పై ప్రతిదాడికి దిగొద్దని, అలా చేస్తే అమెరికా నుంచి ఎలాంటి సహకారం ఉండబోదని స్పష్టం చేశారు. ఉద్రిక్తతల నివారణకు ప్రతిదాడులకు దిగవద్దని బైడన్ సూచించారు. ఇప్పటికే ఐరాస, జీ7, భారత్ సహా ప్రపంచ దేశాలు ఇరాన్-ఇజ్రాయెల్‌లను సంయమనం పాటించాలని కోరాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram