Venomous Snake | స‌ముద్ర‌పు ఒడ్డుకు కొట్టుకొచ్చిన అత్యంత విష‌పూరిత స‌ర్పం..

Venomous Snake విధాత‌: ఓ అత్యంత విష‌పూరిత స‌ర్పం.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ ష‌న్‌షైన్ తీరానికి కొట్టుకొచ్చింది. అచేత‌న స్థితిలో ప‌డి ఉన్న ఆ పామును మార్నింగ్ వాక‌ర్స్ గ‌మ‌నించి, స‌న్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచ‌ర్స్‌కు స‌మాచారం అందించారు. భారీ పొడ‌వున్న పామును స్నేక్ క్యాచ‌ర్స్ గ‌మ‌నించారు. అది తీవ్ర అస్వ‌స్థ‌త‌తో ఉన్న‌ట్లు గుర్తించారు. దానికి గాయ‌మైంద‌ని నిర్ధారించారు. ఆ పామును బ‌తికించేందుకు ఆస్ట్రేలియా జూ వైల్డ్ లైఫ్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అత్యంత విష‌పూరిత‌మైన ఈ స‌ముద్ర‌పు పాము […]

Venomous Snake | స‌ముద్ర‌పు ఒడ్డుకు కొట్టుకొచ్చిన అత్యంత విష‌పూరిత స‌ర్పం..

Venomous Snake

విధాత‌: ఓ అత్యంత విష‌పూరిత స‌ర్పం.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ ష‌న్‌షైన్ తీరానికి కొట్టుకొచ్చింది. అచేత‌న స్థితిలో ప‌డి ఉన్న ఆ పామును మార్నింగ్ వాక‌ర్స్ గ‌మ‌నించి, స‌న్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచ‌ర్స్‌కు స‌మాచారం అందించారు.

భారీ పొడ‌వున్న పామును స్నేక్ క్యాచ‌ర్స్ గ‌మ‌నించారు. అది తీవ్ర అస్వ‌స్థ‌త‌తో ఉన్న‌ట్లు గుర్తించారు. దానికి గాయ‌మైంద‌ని నిర్ధారించారు. ఆ పామును బ‌తికించేందుకు ఆస్ట్రేలియా జూ వైల్డ్ లైఫ్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.

అత్యంత విష‌పూరిత‌మైన ఈ స‌ముద్ర‌పు పాము 10 ఏండ్ల వ‌య‌సును క‌లిగి ఉండి, 2 నుంచి 4 కిలోల బ‌రువు ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. ఇలాంటి విష‌పూరిత‌మైన పాముల‌ను మ‌ళ్లీ స‌ముద్రంలోనే వ‌దిలేయ‌కూడ‌దు. ఇవి అత్యంత ప్ర‌మాద‌క‌రం. ఇవి అత్యంత విష‌పూరితం కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.