Viral Video | రోడ్డు మీద గుట్కా ఉమ్మేసిన ఇండియన్.. కడిగేదాకా విడిచిపెట్టని నేపాలీ.. వీడియో వైరల్

Viral Video | నేపాల్‌లో రోడ్డుపై గుట్కా నమిలి ఉమ్మివేసిన భారతీయులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. వారి కారును ఆపిన ఓ నేపాలీ వ్యక్తి.. గుట్కా మరకలు కడిగేదాకా విడిచిపెట్టలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video | రోడ్డు మీద గుట్కా ఉమ్మేసిన ఇండియన్.. కడిగేదాకా విడిచిపెట్టని నేపాలీ.. వీడియో వైరల్

Viral Video | నేపాల్‌లో రోడ్డుపై గుట్కా నమిలి ఉమ్మివేసిన భారతీయులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. కారులో నుంచి గుట్కా ఉమ్మివేయడం చూసిన ఓ స్థానికుడు వారి కారును ఆపి నిలదీశాడు. ఇది మీ ఇండియా కాదు భాయ్ అని బెదిరిస్తూ.. గుట్కా మరకలు కడిగేదాకా వదిలిపెట్టలేదు. ఇండియన్ టూరిస్టులు సారీ చెప్పినా వినిపించుకోకుండా నేపాలీ వ్యక్తి స్పందించిన తీరు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే.. నేపాల్ పర్యటనకు వెళ్లిన కొందరు భారతీయులు కారులో వెళ్తూ గుట్కా నమిలి రోడ్డుపై ఉమ్మివేశారు. ఇది గమనించి నేపాలీ వ్యక్తి వెంటనే వారి కారును ఆపి గట్టిగా మందలించాడు. ఇది మీ ఇండియా కాదు భాయ్.. నేపాల్.. వెంటనే నీళ్లు పోసి శుభ్రం చేయమని హెచ్చరించాడు. దీంతో భారతీయ పర్యాటకులు అసౌకర్యంగా ఫీలవుతూ పలుమార్లు క్షమాపణలు చెప్పారు. కానీ ఆ నేపాలీ మాత్రం అస్సలు శాంతించలేదు. అంత పెద్ద దేశం నుంచి వచ్చి ఇలా చెత్తగా ప్రవర్తించడం సరైనది కాదంటూ సూచించారు. కేవలం క్షమాపణ చెబితే సరిపోదని.. గుట్కా మరకలను కడగాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో పర్యాటకులు వాటర్ బాటిల్‌తో గుట్కా ఉమ్మివేసిన ప్రాంతం మొత్తాన్ని శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

సోషల్‌మీడియాలో పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే ఈ వీడియో లక్షలాది వ్యూస్‌ను సాధించి పెద్ద చర్చకు దారితీసింది. కొంతమంది నెటిజన్లు నేపాలీ చేసిన చర్యను సమర్థించారు. పబ్లిక్‌లో శుభ్రత పాటించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఇదే నిజమైన దేశభక్తి అని ప్రశంసించారు. మరికొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. చాలామంది నేపాలీలు భారత్‌లో వచ్చి ఇక్కడ పనిచేసుకుంటూ ఉంటున్నారని.. వారిని ఇలా ఎప్పుడూ అగౌరవపరచలేదని తెలిపారు. వారి చేసింది తప్పే.. క్షమాపణ కూడా చెప్పారు.. కానీ వాళ్లు చేసిన దానికి మొత్తం దేశాన్ని తప్పుబట్టడం సరైందని కాదని పలువురు కామెంట్లు చేశారు.

 


 

Read More:

Spain Job | స్పెయిన్‌లో మంచి జాబ్.. ఫ్రీగా ఇల్లు.. బంపరాఫర్ పొందాలంటే ఆ ఒక్కటే కండీషన్!

భర్త మరణంతో కట్టలు తెంచుకున్న దుఃఖం.. కానీ, ఆ కన్నీళ్ల వెనుక.?