భర్త మరణంతో కట్టలు తెంచుకున్న దుఃఖం.. కానీ, ఆ కన్నీళ్ల వెనుక.?

చనిపోయిన భర్త మీదపడి రోదిస్తున్న ఆ భార్యను చూసి అందరూ దు:ఖించారు. దోపిడీ, హత్య కథను నిజమేనని నమ్మారు. కానీ పోలీసుల అనుమానం, సాక్ష్యాలు ఆ కథను వేరే మలుపు తిప్పాయి. ప్రేమ, అవమానాలు, కుట్రతో జరిగిన మధ్యప్రదేశ్ హత్య కేసు సంచలనం రేపుతోంది.

భర్త మరణంతో కట్టలు తెంచుకున్న దుఃఖం.. కానీ, ఆ కన్నీళ్ల వెనుక.? హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా నిలిచిన ప్రియాంక పలు ఫోటోలు

 A Perfect Crime? Wife’s Emotional Act Collapses Under Police Probe

  • ● ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య
  • ● కన్నీళ్ల కట్టుకథతో నమ్మించే ప్రయత్నం
  • ● ప్రేమికుడితో కలిసి భర్త హత్యకు సుపారీ
  • ●  నల్లగా ఉన్నావంటూ భర్తను అవమానించిన భార్య

 

విధాత భారత్​ డెస్క్​ | హైదరాబాద్​:

ధారాపాతంగా కారిపోతున్న కన్నీళ్లు.. వణుకుతున్న గొంతు.. ఎవరు ఆపినా ఆగని దు:ఖం.. ఇది ఓ భార్య రోదన. కళ్ల ముందే భర్త మరణించడం తట్టుకోలేకపోయింది.  “దొంగలు వచ్చి మా జీవితాన్ని నాశనం చేశారు” అని చెప్పిన ఆ యువతి వేదన చూసి అయ్యోపాపం.. అంటూ జాలిపడ్డారు. కానీ, పోలీసులు వచ్చాక కథ మలుపు తిరిగింది.

ముందు దోపిడీ.. తరువాత హత్య.. అప్పుడు?

దేవకృష్ణ హత్య కేసు విజువల్స్ – గ్రామంలో కలకలం, బాధితుడి ఫోటో

దేవకృష్ణ హత్యతో గ్రామంలో కలకలం… కేసు దర్యాప్తు వేగవంతం

ఏప్రిల్‌ 7 రాత్రి ధార్ జిల్లాలోని ఇంట్లో మసాలా దినుసుల వ్యాపారి పురోహిత్​ దేవకృష్ణ రక్తపుమడుగులో మృతదేహంగా కనిపించాడు. అతని పక్కనే రోదిస్తూ  కూర్చున్న భార్య ప్రియాంక, రాత్రి దొంగలు వచ్చి తమను కట్టేశారనీ, నగలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించి, అడ్డుకున్న నా భర్తను పొడిచి చంపేసి వెళ్లిపోయారంటూ ఏడ్చింది. నగలు, డబ్బు అపహరించారని కూడా చెప్పింది. ఆమె చెప్పిన ప్రతి మాట కూడా నిజంగా అనిపించేలా ఉండటంతో మొదట దోపిడీగా కేసు నమోదు అయింది. ప్రియాంక రోదన చూసి చుట్టుపక్కల వారందరూ కూడా ఏడ్చారు.

నిజం చెప్పిన ఆనవాళ్లుఅతకని అబద్ధాలు

భర్త దేవకృష్ణతో ప్రియాంక ఫోటోలు – హత్యకు ముందు కుటుంబ జీవితం

బయటకు సాధారణంగా కనిపించిన దాంపత్యం… లోపల విభేదాలు, గొడవలు

కానీ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఒక్కొక్క క్లూ పరిశీలిస్తూ ముందుకు వెళ్లిన కొద్దీ కథలో అతుకులు  కనిపించాయి. దోపిడీ జరిగిందని చెప్పిన నగలు ఇంట్లోనే ఓ చోట దాచిపెట్టబడి దొరికాయి. గది అల్లకల్లోలం ఉన్నా, అది సాధారణంగా జరిగే దోపిడీలా కనిపించలేదు. మృతుడి ఒంటిపై ఉన్న గాయాల తీరు కూడా హఠాత్తుగా దాడి చేసి పొడినట్టు లేదు, ప్రణాళికాబద్ధంగా చేసిన హత్యగా కనిపించింది.

అంతేకాకుండా, ప్రియాంక మాటల్లో తేడాలు కూడా పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చాయి. కేసు మలుపు తిరిగింది. మొబైల్ డేటా, సాక్ష్యాలు, పరిస్థితులూ, ప్రియాంక విచారణ.. కలిసి పోలీసులను లక్ష్యం వైపు  నడిపించాయి—అంతే.. ఇది దోపిడీ కాదు… పక్కాగా ప్లాన్​ చేసిన హత్యగా నిరూపణ అయింది.

అవమానం.. అవహేళన.. హత్య..

మధ్యప్రదేశ్ హత్య కేసులో ప్రియాంక, దేవకృష్ణ, కమలేశ్‌ ఫోటో కలెక్షన్

హత్య కేసులో పాత్రలు — హతుడు దేవకృష్ణ, భార్య ప్రియాంక, , ప్రేమికుడు కమలేశ్‌

దర్యాప్తు కాస్త లోతుగా సాగిన కొద్దీ అసలు కథ బయటపడింది. ప్రియాంకకు కమలేశ్​ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.  దేవకృష్ణను ప్రియాంక తరచూ అవమానించేదని, చిన్నచూపు చూసేదని కుటుంబం ఆరోపిస్తోంది. నువ్వు నల్లగా ఉన్నావు… నీకూ నాకూ జోడీ కుదరదు. నీకంటే గొప్పవాడికి దక్కాల్సినదానినంటూ అతని మనసును మాటలతో గాయపరచేదని సోదరి పోలీసులకు తెలిపింది. రోజూ  గొడవలు, ఫోన్లలో కూడా అరుపులతో ఆ ఇంట్లో ప్రశాంతత దూరమై చాలా కాలమైందంటూ భోరున విలపించింది.

ఈ విభేదాలు, అవమానాలు చివరకు ప్రమాదకర దిశగా మలుపు తిరిగాయి. భర్తను అడ్డు తొలగించుకుని ప్రియుడితో వెళ్లిపోవాలనే ప్రియాంక ఆలోచనకు దారి తీసాయి. దీనికి లవర్​ కమలేశ్​ పూర్తిగా మద్దతు తెలిపాడు.

లక్ష రూపాయలు సుపారీ ఇచ్చి ఓ కిల్లర్‌ను నియమించారు. ముందుగానే ఓ 50 వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. హత్య జరిగిన రాత్రి ఇంటి తలుపు ఉద్దేశపూర్వకంగా తెరిచిపెట్టారు. నిద్రలో ఉన్న దేవకృష్ణపై దాడి చేసి చంపేశారు. తర్వాత మొత్తం ఇంటిని దోపిడీ జరిగిన ప్రదేశంలా అల్లకల్లోలం చేసి, దేవకృష్ణను చంపి,   నగలు ఎత్తుకెళ్లారని నాటకం ఆడారు.

అందానికి బలైపోయిన జీవితాలు

కానీ నిజం ఎక్కువసేపు దాగలేదు. పోలీసుల అనుభం, లభించిన సాక్ష్యాలు, విచారణలో ఒత్తిడి పెరగడంతో చివరకు ప్రియాంక చేసిన నేరాన్ని ఒప్పుకుంది. పోలీసులు ఆమెను, కమలేశ్​ను అరెస్ట్ చేశారు. కిరాయి హంతకుడు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.

చేయని నేరానికి, నల్లగా ఉన్న పాపానికి దేవకృష్ణ బలైపోవడం స్థానికులను, బంధువులను తీవ్రంగా బాధించింది. అందమైన జీవితం కావాలనుకున్నప్రియాంకకు జీవితాంతం జైలు గోడల మధ్య గడపాల్సిన జీవితం దక్కింది.