Woman Jailer | ఖైదీతో మహిళా జైలర్ శృంగారం చేసిన షాకింగ్ ఘటన ఇంగ్లండ్ (England) లో వెలుగులోకి వచ్చింది. వాండ్వర్త్లోని హెచ్ఎంపీ (HMP) జైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను అదే జైల్లో ఉన్న మరో ఖైదీ వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Woman Jailer : ఖైదీతో మహిళా జైలర్ శృంగారం చేసిన షాకింగ్ ఘటన ఇంగ్లండ్ (England) లో వెలుగులోకి వచ్చింది. వాండ్వర్త్లోని హెచ్ఎంపీ (HMP) జైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను అదే జైల్లో ఉన్న మరో ఖైదీ వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
జైలులో ఖైదీతో సెక్స్‌లో పాల్గొన్న మహిళా జైలర్ పేరు 31 ఏళ్ల లిండా డిసౌజాగా ఉన్నతాధికారులు గుర్తించారు. వీడియో వైరల్ కావడంతో ఆమె వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2023 టీవీ షో ‘ఓపెన్ హౌస్ : ది గ్రేట్ సెక్స్ ఎక్స్పరిమెంట్’లో లిండా, ఆమె భర్త నాథన్ పోటీదారులని లిండా సోదరి ఆండ్రియా తెలిపారు. అడల్ట్ వీడియో ప్లాట్ఫామ్లో లిండాకు రహస్య ఖాతా ఉందని కూడా ఆండ్రియా చెప్పింది.
ఎక్స్‌లో వైరల్‌గా మారిన ఆ వీడియోలో పోలీసు యూనిఫాంలో ఉన్న మహిళా జైలర్ ఖైదీతో శృంగారం చేస్తూ ఉంది. ఆ దృశ్యాలను అదే సెల్లో ఉన్న మరో ఖైదీ తన మొబైల్లో చిత్రీకరించాడు. ఓ చేత్తో సిగరెట్ తాగుతూ.. మరో చేత్తో వీడియో తీస్తున్న ఆ వ్యక్తి.. ‘హాయ్.. ఈ రోజు మనం చరిత్ర సృష్టించాం’ అంటాడు. ఆ తర్వాత ‘ఇదే నేను మాట్లాడుతున్నా’ అంటూ కెమెరాను శృంగారం జరుగుతున్న వైపు తిప్పాడు.
ఈ సందర్భంగా మరో ఖైదీ సెల్‌లోకి వెళ్తుండగా వీడియో తీస్తున్న ఖైదీ అతనితో ‘కొంచెం ఆగండి’ అనడం వినిపిస్తుంది. ఆ తర్వాత వీడియో తీస్తున్న ఖైదీ కెమెరాను తనవైపు తిప్పుకుని ‘ఇది వాండ్వర్త్ జైలు’ అని చెప్పాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.