ఆమెరికాలో ఓ సెక్స్ వర్కర్ దుర్మార్గం.. హెచ్‌ఐవీ డెంజర్‌లో 211 మంది

నకు హెచ్‌ఐవీ పాజిటీవ్ ఉందని తెలిసినా ఓ సెక్స్ వర్కర్ చేసిన దుర్మార్గం ఆమెతో లైంగిక సుఖం పంచుకున్న వందల మందిని ప్రాణాపాయంలో పడేసింది.

ఆమెరికాలో ఓ సెక్స్ వర్కర్ దుర్మార్గం.. హెచ్‌ఐవీ డెంజర్‌లో 211 మంది

విధాత: తనకు హెచ్‌ఐవీ పాజిటీవ్ ఉందని తెలిసినా ఓ సెక్స్ వర్కర్ చేసిన దుర్మార్గం ఆమెతో లైంగిక సుఖం పంచుకున్న వందల మందిని ప్రాణాపాయంలో పడేసింది. అమెరికాలోని ఒహైయో రాష్ట్రం మెరియెట్టాకు చెందిన సెక్స్‌వర్కర్‌ లిండా లెచెసే తనకు ఎయిడ్స్ ఉందని తెలిసి కూడా ఆమె అనేక మందితో లైంగిక సంబంధాలు కొనసాగించింది. సెక్స్ వర్కర్ వ్యవహారం తెలిసిన అధికారులు ఆమెతో శృంగారంలో పాల్గొన్న వారికి హెల్త్ అలర్ట్ జారీ చేశారు. వారంతా తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

సంబంధిత వ్యక్తులకు వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తూ.. మిగతా ఎవరైనా ఉంటే తమకు తెలియజేయాలని సూచిస్తున్నామని వాషింగ్టన్ కౌంటీ షెరీప్ కార్యాలయ అధికారులు, మెరియెట్టా పోలీసులు వెల్లడించారు. ఈ సమస్యకు కారణమైన మహిళను అరెస్టు చేశారు. హెచ్‌ఐవీ సోకిని లెచెసే 2022లో జనవరి నుంచి దాదాపుగా 211మందితో లైంగిక సంబంధం కొనసాగించినట్లుగా అధికారులు గుర్తించారు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని పొరుగు రాష్ట్రాలతో పాటు స్థానిక పౌరులకు సూచించారు.