Horoscope | నేటి రాశి ఫలాలు.. వారికి ఆకస్మిక ధననష్టం, ధనయోగం
Horoscope |
జ్యోతిషం అంటే మనవారికి జన్మజన్మల నుంచి చెరగని నమ్మకం. మనకు లేచిన సమయం నుంచి నిద్రించే వరకు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటా. అందుకే రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన పనులు నిర్వహిస్తూ ఉంటాం. దాని ప్రకారమే పడుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవగానే మొదట చాలామంది సెర్చ్ చేసేది వారికి ఆరోజు ఎలా ఉండబోతుందనే. అలాంటి వారందరి కోసం వారి పేర్ల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం
అనారోగ్య బాధలు అధిగమిస్తారు. ఆటంకాలున్నానూతనకార్యాలకు సత్ఫలితాలు. ప్రయాణాల్లో, వృత్తి, వ్యాపారాల్లో ధననష్టం రాకుండా జాగ్రత్త వహించాలి. సహాయ సహకారాల కోసం వేచిఉంటారు. దైవదర్శనం లభిస్తుంది.
వృషభం
బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టం . అస్థిరమైన నిర్ణయాలు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసర భయం.
మిథునం
నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనయోగం. గుడ్ న్యూస్ వింటారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
కర్కాటకం
వ్యవసాయం చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు కార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనత.
సింహం
విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు.సంతృప్తికరంగా కుటుంబ పరిస్థితులు. ఆకస్మిక ధననష్టం.. జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా. ప్రయాణాలు ఎక్కువ.
కన్య
శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవమర్యాదలు, అన్ని సుఖాలు పొందుతారు.

తుల
ప్రయత్నకార్యాలకు ఆటంకాలు. బంధు మిత్రులతో విరోధ అవకాశాలు. స్త్రీల మూలకంగా శతృబాధలు. మనస్తాపాలు. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నం వదిలివేయడం మంచిది.
వృశ్చికం
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి. ఆర్థిక ఇబ్బందులు. నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఆత్మీయుల సహాయసహకారాలకై సమయం వెచ్చించాల్సి వస్తుంది.
ధనుస్సు
వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి. ఆకస్మిక ధనలాభం. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి.
మకరం
అనుకూల స్థానచలనం. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలు. అస్థిర నిర్ణయాలు. ఆకస్మిక వ్యయం. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు.
కుంభం
నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం. విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు.
మీనం
ఆకస్మిక ధనలాభం. కుటుంబంలో సంతృప్తి. పేరు, ప్రతిష్ఠలు, సంఘంలో గౌరవ మర్యాదలు. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram