Bus Tragedy | మరో స్లీపర్ బస్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై దిల్లీ నుంచి లఖ్‌నవూ మీదుగా గోండా ప్రాంతానికి వెళ్తున్న ఏసీ స్లీపర్ బస్సులో ఆదివారం మంటలు చెలరేగాయి.

Bus Tragedy | మరో స్లీపర్ బస్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

విధాత :
ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై దిల్లీ నుంచి లఖ్‌నవూ మీదుగా గోండా ప్రాంతానికి వెళ్తున్న ఏసీ స్లీపర్ బస్సులో ఆదివారం మంటలు చెలరేగాయి. తెల్లవారు జామున 4.45 గంటల ప్రాంతంలో రెవ్రి టోల్ ప్లాజా సమీపంలో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను కిందకు దించేసి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరకుని మంటలు అర్పివేశారు. డ్రైవర్ అప్రమత్తతలో ఎలాంటి ప్రమాదం సంభవించలేదని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులు 39 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. టోల్ ప్లాజాకు 500 మీటర్ల దూరంలో ఉండగా ప్రమాదం సంభవించినట్లు వెల్లడించారు. మొదటగా బస్సు టైర్లో మంటలు చెలరగడంతో తరువాత వాహనంలోని మిగిలిన భాగాలను వ్యాపించినట్లు డ్రైవర్ జగత్ సింగ్ చెప్పారు. చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ ను పోలీసులు ప్రశంసించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న ప్రైవేటు బస్సు యాజమాన్యం ప్రయాణికుల కోసం మరోబస్సును సిద్దం చేసింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఘటనతో అగ్రా-లఖ్ నవూ ఎక్స్ ప్రెస్ వేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.