Bala Krishna|రియ‌ల్ లైఫ్‌లో ఎమ్మెల్యేగా బాల‌య్య‌.. ఇప్పుడు రీల్ లైఫ్‌లోను ఎమ్మెల్యేగా సంద‌డి చేయ‌నున్నాడా..!

  • Publish Date - April 12, 2024 / 04:50 PM IST

Bala Krishna| నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఒక‌వైపు రాజ‌కీయాలు, మ‌రోవైపు సినిమాల‌తో తెగ సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. రాజ‌కీయాల‌లో త‌న‌దైన ముద్ర వేసుకున్న బాల‌య్య మ‌రి కొద్ది రోజుల‌లో రానున్న ఎల‌క్ష‌న్స్‌లోను స‌త్తా చాటాల‌ని చూస్తున్నాడు. ఈ సారి పోటి గ‌ట్టిగా ఉంటుంది కాబ‌ట్టి బాలయ్య ప్ర‌చారాలు కూడా గ‌ట్టిగానే చేస్తున్నాడు. ఇక మరోవైపు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో త‌త‌న 109వ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి తాత్కాలిక బ్రేక్ వేసిన‌ట్టు తెలుస్తుంది. ఎల‌క్ష‌న్స్ పూర్త‌య్యాక బాల‌య్య తిరిగి సినిమాలతో బిజీ కానున్నాడు.అయితే బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ స‌క్సెస్ కొట్టిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు అన్‌స్టాప‌బుల్ అనే షోతో కూడా అద‌ర‌గొట్టేస్తున్నాడు.

సినిమాల‌లో త‌న బాడీ లాంగ్వేజ్‌కి త‌గ్గ పాత్ర‌లు ఎంచుకుంటూ ముందుకు పోతున్న బాల‌య్య ప్రేక్ష‌కుల‌కి కావ‌ల్సినంత వినోదం పంచుతున్నాడు. ఇప్పుడు బాల‌య్య త‌న 109వ సినిమాతో మ‌రింత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌డం ఖాయంగా చెబుతున్నారు. ఈ మూవీకి ఇంకా టైటిల్ రివీల్ చేయ‌లేదు కాని ప‌లు టైటిల్స్ అయితే ప్ర‌చారంలో ఉన్నాయి. ఇక కొద్ది రోజుల క్రితం గ్లింప్స్ విడుద‌ల కాగా, ఇది అంద‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్‌గా మారింది. ఈ మూవీలో బాల‌య్య డ్యూయ‌ల్ రోల్ పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఒక పాత్ర‌లో ప‌వ‌ర్ ఫుల్ ఎమ్మెల్యేగా క‌నిపించి సంద‌డి చేయనున్నాడ‌ట‌.

బాల‌య్య రియల్ లైఫ్ లో హిందూ పురం ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి బాలయ్య హిందూ పురం నుంచి గెలిస్తే హ్యాట్రిక్ కొట్టినట్లు అవుతుంది. మ‌రి త‌న 109వ చిత్రంలోను బాల‌య్య ఎమ్మెల్యేగా క‌నిపిస్తే ద‌బిడి దిబిడే అంటున్నారు ఫ్యాన్స్. పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా రియ‌ల్ లైఫ్‌లో దుమ్ము రేపుతున్న బాల‌య్య వెండితెర‌పై కూడా అద‌ర‌గొట్ట‌డం ఖాయం అని చెబుతున్నారు. మ‌రి దీనిపై త్వ‌ర‌లో ఏదైన క్లారిటీ వ‌స్తుందా అనేది చూడాలి. ఇక ఈ చిత్రాన్ని ఏడాది చివర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. మూవీ ప‌క్కా హిట్ అవుతుంద‌నే కాన్ఫిడెన్స్ తో వారు ఉన్నారు.

Latest News