Bigg Boss Show Season 9| బిగ్ బాస్ 9వ సీజన్ 7, సెప్టెంబర్‌ 2025 నుంచే

Bigg Boss Show Season 9| బిగ్ బాస్ 9వ సీజన్ 7, సెప్టెంబర్‌ 2025 నుంచే

విధాత : హీరో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) హోస్టుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న తెలుగు రియాల్టీ షో(Telugu Reality Shows) ‘బిగ్‌బాస్‌’ షో 9వ సీజన్(Bigg Boss Show Season9) నేడు ఆదివారం(సెప్టెంబర్ 7) రాత్రి 7గంటలకు  స్టార్ మా చానల్ లో ప్రారంభం(Start Today) కానుంది. ఎప్పటికప్పుడు ప్రతి సీజన్ కు కొత్త దనం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న షో నిర్వాహకులు 9వ సీజన్ మరింత కొత్తగా..వైవిధ్య భరితంగా..వినోదాన్ని అందించేలా ఉండేలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ కొత్త సీజన్ లాచింగ్ ప్రోమోను పలువురు కంటెస్టెంట్(Bigg Boss Contestants)వాయిస్ లతో కొనసాగింది.

ఇందులో ఓ కంటెస్టెంట్‌ హౌస్‌లోకి గిఫ్ట్‌ తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా బిగ్‌బాస్‌ తిరస్కరిస్తాడు. దీంతో, ‘నువ్వు ఇంటికెళ్లిపోవచ్చు’ అని నాగార్జున చెబుతారు. అంటే తొమ్మిదవ సీజన్ పాత సీజన్లకు భిన్నంగా..ఊహించని ట్విస్టులు..టాస్క్ లు..పోటీలతో సాగనుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. తొమ్మిదవ సీజన్ లో కంటెస్టెంటులుగా ఎవరెవరు రాబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తొమ్మిదవ సీజన్ పై ఆసక్తి పెంచేలా నాగార్జున ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ పంచ్‌ డైలాగ్ పేల్చేశారు.