Bihar Elections | బీహార్ ఎగ్జిట్ పోల్స్.. మళ్లీ అది రిపీట్ అవుతుందా?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు రెండో విడత పోలింగ్ పూర్తికాగా, 5 గంటల వరకు ఓటింగ్ శాతం 67.14శాతం నమోదైంది. రెండు విడతల్లో మొత్తం ఓటింగ్ శాతం సగటున 66 శాతానికి చేరింది. ఫలితాలపై ఆయా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రూపంలో తమ అంచనాలను ప్రకటించాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు రెండో విడత పోలింగ్ పూర్తికాగా, 5 గంటల వరకు ఓటింగ్ శాతం 67.14శాతం నమోదైంది. రెండు విడతల్లో మొత్తం ఓటింగ్ శాతం సగటున 66 శాతానికి చేరింది. హోరాహోరిగా తలపడిన ఎన్డీఏ కూటమి, మహాగట్ బంధన్ కూటమిల భవితవ్యం ఈ నెల 14న తేలనుంది. ఈ క్రమంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రూపంలో తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. ఈ నేపధ్యంలో పలు సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌ప్రకారం, బీజేపీ, జనతాదళ్ (JDU) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి.
‘పీపుల్స్ పల్స్’ సంస్థ మొదటగా విడుదల చేసిన అంచనా ప్రకారం, ఎన్డీఏకు 133 నుంచి 159 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. మరో సంస్థ ‘పీపుల్స్ ఇన్‌సైట్’ కూడా ఎన్డీఏకే విజయం దక్కుతుందని తెలిపింది. మాట్రైజ్ సంస్థ ఎన్డీఏకు 147-167 సీట్లు వచ్చే అవకాశముందని, మహాగట్ బంధన్ కు 70-90 స్థానాలు దక్కే అవకాశముందని అంచనా వేసింది. భాస్కర్..ఎన్డీఏకు 145-160, మహాగట్ బంధన్ కు 73-91 సీట్లు రావచ్చొని తెలిపింది. 135-150 సీట్లు ఎన్డీఏకు, 88-103 స్థానాలు మహాగట్ బంధన్ కూటమికి దక్కే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.
దీంతో ప్రతిపక్ష మహాగట్‌బంధన్ కూటమిలో ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు రెండో స్థానం దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీహార్ అసెంబ్లీ మొత్తం 243 స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 122 సీట్ల మెజార్టీ అవసరం ఉంటుంది. ఎన్డీఏ కూటమిలోని బీజేపీ, జేడీయూ తలా 101 సీట్లపై పోటీచేస్తున్నాయి. లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) 29 సీట్లు, హిందుస్తానీ అవామ్ మోర్చా , రాష్ట్రీయ లోక్మత పార్టీ చెరో ఆరు సీట్లపై పోటీ చేశాయి. మరోవైపు మహాగట్ బంధన్ కూటమిలో ఆర్జేడీ 143, కాంగ్రెస్ 61, సీపీఐ9, సీపీఎం 4, సీపీఐ(ఎంఎల్) 20, వీఐపీ పార్టీ పార్టీ 15 స్థానాల్లో పోటీలో ఉంది.
అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉన్నప్పటికీ, బీహార్ రాజకీయాల్లో అనూహ్య మలుపులు తిరిగే అవకాశాలు లేకపోలేదు. దీనికి నిదర్శనం 2020 ఎన్నికల్లో వెలువడిన అంచనాలు.. ఆ అంచనాలను పటాపంచలు చేస్తూ వెలువడిన ఫలితాలు. అప్పుడు చాలా సర్వేలు చేసిన అంచనాలు తప్పుగా తేలాయి. తేజస్వీయాదవ్ నేతృత్వంలోని మహాగట్ బంధన్ గెలుస్తుందని సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. కానీ, ఊహించని రీతిలో ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. కాగా, ఈసారి కూడా తుది ఫలితాలు వచ్చే వరకూ అంచనాలు నమ్మలేని స్థితిలో ఉన్నాయి. నవంబర్ 14న జరిగే ఓట్ల లెక్కింపుతో గెలుపు ఎవరిదనే ఉత్కంఠకు తెరపడనున్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram