Bomb Scare | తమిళనాడు ఈడీ ఆఫీస్ కు బాంబు బెదిరింపులు

తమిళనాడు రాజధాని చెన్నైలోని ఈడీ కార్యాలయంతో పాటు రాష్ట్ర డీజీపీకి శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. చైన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి గుర్తు తెలియని ‘కార్యాలయంలో బాంబు పెట్టాం’ అని హెచ్చరిస్తూ మెయిల్ పంపాడు.

Bomb Scare | తమిళనాడు ఈడీ ఆఫీస్ కు బాంబు బెదిరింపులు

చెన్నై :

తమిళనాడు రాజధాని చెన్నైలోని ఈడీ కార్యాలయంతో పాటు రాష్ట్ర డీజీపీకి శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. చైన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి గుర్తు తెలియని ‘కార్యాలయంలో బాంబు పెట్టాం’ అని హెచ్చరిస్తూ మెయిల్ పంపాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన చెన్నై పోలీస్ అధికారులు భవనాన్ని ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌లను అప్రమత్తం చేశారు. పోలీసులు, బాంబ్‌ డిస్‌పోజల్‌ బృందాలు ప్రాంతాన్ని చుట్టుముట్టి గంటలపాటు తనిఖీలు చేపట్టాయి.

చివరికి ఎలాంటి బాంబ్ లభించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో హోక్స్ మెయిల్ గా తేలింది. అయినప్పటికీ, భద్రతా పరంగా హై అలర్డ్ కొనసాగిస్తున్నట్లు చెన్నై పోలీస్ కమిషనర్ వెల్లడించారు. కాగా, ఈడీ కార్యాలయం తరచూ రాజకీయ నాయకులపై దర్యాప్తులు చేపట్టడం వల్ల ఇటీవల తమిళనాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి విధితమే.. ఈ నేపథ్యంలో బాంబ్ బెదిరింపు పై పోలీసులు అత్యంత సీరియస్ గా దర్యాప్తు చేపట్టారు. అలాగే, ఈ మెయిల్ పంపించిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ సర్వేలెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి.