Chetak Horse Fair| అక్కడ లగ్జరీ కార్ల కంటే..గుర్రాలకే ధర ఎక్కువ

దేశవాళీ ఖరీదైన లగ్జరీ కార్ల కంటే కూడా అక్కడ గుర్రాలకే ఎక్కువ ధర. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. మహారాష్ట్రలోని నందూర్బార్​జిల్లాలోని సారంగ్‌ ఖేడ్ లో ఏటా నిర్వహించే చేతక్ పశువుల సంత దేశంలోని ప్రసిద్ద గుర్రాల క్రయవిక్రయాలకు వేదికగా నిలుస్తుంది. కోటి మేరకు ధర ఉన్న గుర్రాలే ఈ సంతకు వస్తుంటాయి. ఈ సారి సంతలో వైట్ కోబ్రా అనే తెల్లగుర్రం రూ.1.71కోట్లు, రుద్రాణి అనే గోదుమ రంగు గుర్రం 1.17కోట్లకు అమ్మకానికి పెట్టడం విశేషం.

Chetak Horse Fair| అక్కడ లగ్జరీ కార్ల కంటే..గుర్రాలకే ధర ఎక్కువ

విధాత : దేశవాళీ ఖరీదైన లగ్జరీ కార్ల కంటే కూడా అక్కడ గుర్రాలకే ఎక్కువ ధర. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. మహారాష్ట్రలోని నందూర్బార్​జిల్లాలోని సారంగ్‌ ఖేడ్ లో ఏటా నిర్వహించే చేతక్ పశువుల(Chetak Horse Fair) సంత దేశంలోని ప్రసిద్ద గుర్రాల క్రయవిక్రయాలకు వేదికగా నిలుస్తుంది. ఏటా వేలాది గుర్రాలు ఇక్కడ అమ్మకానికి వస్తుంటాయి. గుర్రాల కనీస ధర రూ.50వేల నుంచి మొదలవుతుంది. కోటి మేరకు ధర పలికే గుర్రాలే ఎక్కువగా ఈ సంతకు వస్తుంటాయి.

తాజాగా నిర్వహించిన చేతక్ సంతలో దేశం నలుమూలల నుంచి శ్రేష్టమైన ఉత్తమ జాతి అశ్వాలను అమ్మకానికి తీసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా రెండు గుర్రాలు మార్కెట్ లో అన్నిటి కంటే అధిక ధర పలకడం విశేషం. ఇందులో ప్రధానంగా వైట్ కోబ్రా(White Cobra Horse) అనే పేరుగల తెల్లగుర్రాన్ని పంజాబ్‌కు చెందిన జగ్‌తార్ సింగ్ రూ.1.71 కోట్లకు అమ్మకానికి పెట్టాడు. వైట్ కోబ్రా గుర్రం ఎత్తు 61 అంగుళాలు..ప్రతి నెలా ఈ గుర్రం పోషణకు తాను రూ. 75 వేలు ఖర్చు చేస్తున్నట్లుగా యజామాని జగ్‌తార్ సింగ్ తెలిపాడు. ప్రతి రోజు పాలు, పప్పులు వంటి ప్రత్యేక ఆహారంతో ఈ గుర్రాన్ని పోషిస్తామని చెప్పాడు. అయితే జగాతార్ పెట్టిన ఆ రేటుకు వైట్ కోబ్రా అమ్ముడుపోలేదు. అంతకుముందు పుష్కర్ సంతలోనూ వైట్ కోబ్రా ధర రూ.1.5కోట్లు పలికింది. కాని జగ్ తార్ సింగ్ అప్పుడు దానిని విక్రయించకుండా..చేతక్ సంతలో మరింత ఎక్కువ ధరకు విక్రయానికి పెట్టాడు. వైట్ కోబ్రా 13 పోటీల్లో పాల్గొనగా..10 పోటీల్లో మొదటి స్థానంలో, మూడు పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది.

ఇకపోతే చేతక్ సంతలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో గుర్రం గోధుమ రంగులోని రుద్రాణి(Rudrani Horse). ఈ గుర్రాన్ని దాని యజమాని రాజేంద్ర పాటిల్ రూ.1.17కోట్లకు అమ్మకానికి పెట్టాడు. మార్వారి జాతికి చెందిన రుద్రాణి గుర్రం ఎత్తు 65అంగుళాలు. తక్కువ వయసులో ఎక్కువ పొడవు పెరుగడం దీని ప్రత్యేకత. రుద్రాణి గుర్రం ప్రతిరోజు 8లీటర్ల ఆవుపాలు, పప్పు దినుసులు ఆహారంగా పెట్టడంతో పాటు ఆవనూనె మసాజ్ చేస్తామని రాజేంద్ర పాటిల్ తెలిపాడు.